సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, ఒకవేళ విడిపోయినా వారి పిల్లలకు మాత్రం తండ్రి ఇంటిపేరు మాత్రమే ఉంటుంది. ఎవరు దాన్ని మార్చలేరు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నట వారసుడు అకీరా నందన్ ఇంటిపేరు మారడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అకీరా చూస్తూ ఉండగానే పెరిగి పెద్దవాడైపోయాడు. ఎప్పుడెప్పుడు మెగా వారసుడు సినిమాల్లోకి అడుగుపెడతాడో అని పవన్ ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులు కూడా కాచుకొని కూర్చున్నారు. రేణు- పవన్ విడిపోయినప్పటికీ అకీరా ఎప్పుడు మెగా వారసుడే అని, వారి రక్తమే అకీరాలో ప్రవహిస్తుందని రేణు చాలాసార్లు బాహాటంగానే చెప్పింది. అది నిజం చేస్తూనే అకీరా కూడా మెగా ఫంక్షన్స్ లో, తన అన్నలతో కలిసి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. దీంతో కొణిదెల వారసుల లిస్ట్ లో అకీరా నందన్ కూడా ఒకడు. విడాకులు తీసుకొని విడిపోయిన పిల్లలకు మాత్రం పవన్ కళ్యాణ్ తండ్రి బాధ్యతలను నెరవేరుస్తూనే ఉంటాడు. వారికి కావాల్సినవి అన్ని చేసిపెడుతూనే ఉంటాడు. ఇక తాజాగా అకీరా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగిన విషయం విదితమే.. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అయ్యారు. ఆ తరువాత అకీరా తాన్ హిడెన్ టాలెంట్ ను బయటపెట్టి ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘దోస్తీ’ పాటకు పియానో వాయించి తన బ్యాచ్ మేట్స్ కి డెడికేట్ చేసాడు.
ఇక ఆ సమయంలో స్క్రీన్ మీద ‘అకీరానందన్ దేశాయ్’ పియానో ప్లే చేస్తున్నట్లు కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అకీరా నందన్ కొణిదెల అని ఉండాలి కానీ అకీరా నందన్ దేశాయ్ అని తల్లి ఇంటిపేరును యాడ్ చేసుకోవడం ఏంటి..? అని పవన్ ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు. అకీరా తల్లి ఇంటిపేరును పెట్టుకోవడానికే ఇష్టపడుతున్నాడు అంటే కొణిదెల వారసుడిగా ఉండాలనుకోవడం లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు విడిపోయినా అకీరా తన తండ్రి సర్ నేమ్ నే పెట్టుకోవాల్సిందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ ఫోటో నిజమైనదా..? లేక ఎవరైనా కావాలని ఎడిట్ చేశారా..? అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా అకీరా కొణిదెల వారసుడు కాదా..? అనే అనుమానమే పవన్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. మరి ఈ విషయమై రేణు క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.