Site icon NTV Telugu

Akira Nandan: అకిరా నందన్ AI లవ్ స్టోరీ.. హైకోర్టు కీలక ఆదేశాలు

Akira Nandan

Akira Nandan

పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అఖీరా నందన్ గోప్యత హక్కుల ఉల్లంఘనపై, ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీతో తన ఇమేజ్ డ్యామేజ్ అయిందని హైకోర్టును ఆశ్రయించాడు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్. ఏఐలో తన లవ్ స్టోరీ పేరుతో రూపొందించిన చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో, ఆ లవ్ స్టోరీ సినిమాపై తాత్కాలిక నిషేధం విధించింది కోర్టు.

Also Read:TharunBhascker – EeshaRebba: త్వరలోనే ‘గుడ్ న్యూస్’ వినవచ్చేమో..

డీప్ ఫేక్ కంటెంట్, ఇతరుల ప్రైవసీని స్పష్టంగా దోపిడీ చేయడమే అని ధర్మాసనం అభివర్ణించింది. వక్రీకరించిన కంటెంట్ ద్వారా ప్రతిష్టకు భంగం కలిగిందంటూ కామెంట్ చేసింది. అంతేకాక, సోషల్ మీడియాలో అఖీరా నందన్ పేరుతో ఉన్న నకిలీ ఖాతాలను కూడా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మెటా, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాక, ఆ నకిలీ ఖాతాల ఐపీ అడ్రస్ వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version