Akhil Akkineni: సినిమాల ఎంపిక విషయంలో తన తాతయ్య చెప్పింది ఫాలో అవబోతున్న అఖిల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అక్కినేని ఫ్యామిలీ సినిమా మనం లో గెస్ట్ రోల్ అదరగొట్టిన అఖిల్.ఆ తర్వాత అఖిల్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు..కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హలో సినిమాలో నటించాడు. ఈ సినిమా కొంత మెప్పించిందని చెప్పాలి. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తే ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు.తరువాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.కానీ ఆ సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు మరియు హీరోయిన్ కే వెళ్ళింది.ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటించాడు. ఈ సినిమా కోసం బాగా హైప్ ను క్రియేట్ చేశాడు.కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా చూసిన వారంతా అఖిల్ ఇలాంటి సినిమాను ఎందుకు తీసాడు అంటూ విమర్శలు చేసారు..సోషల్ మీడియాలో అఖిల్ పై భారీగా విమర్శలు వచ్చాయి.. ఏజెంట్ సినిమా ప్లాప్ కావడంతో అఖిల్ కెరీర్ డైలామాలో పడింది. ఎలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో అని తెగ ఆలోచిస్తున్నాడు.అఖిల్ చేసిన సినిమాలన్నీ కూడా కథ పరంగా ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోయాయి. అందుకే ఆ సినిమాలన్నీ కూడా ప్లాప్ గా నిలిచాయి..
అఖిల్ మొదటి నుంచి సినిమాల ఎంపిక విషయంలో తొందరపడటం వల్ల ఇలా అవుతుందని అతని సన్నిహితులు చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ అఖిల్ మాత్రం వచ్చిన సినిమాలని చేసుకుంటూ పోవటం వల్ల అవి ప్రేక్షకులకు నచ్చడం లేదు.అయితే ఎలాంటి సినిమాను చేయాలి అనే సందేహంలో ఉండగా అఖిల్ కు తన తాత అక్కినేని నాగేశ్వరరావు గారి మాటలు గుర్తుకు వచ్చాయి.సినిమాల పరంగా ప్రేక్షకుల మనసు దోచేయాలని తన చిన్నతనం లో సలహాలు ఇచ్చేవారట. దీనితో కథలో బలం ఉండాలని తెలుసుకున్నాడు అఖిల్ ..మంచి కధలను ఎంపిక చేసుకొని డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలను చేయాలనుకుంటున్నాడు అఖిల్.అటువంటి కథలను ఎంచుకొని తానే నిర్మించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read
- Tollywood : ఆగస్టులో యుక్తి తరేజా Vs రితికా నాయక్.. ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్
- 72nd National Film Awards : 72వ జాతీయ అవార్డులపై విమర్శలు.. అద్భుతమైన సినిమాలకు నో అవార్డ్స్
- Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
- Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
తాజావార్తలు
-
Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్‌లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
-
Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్‌చుక్ భార్య..
-
Tollywood : ఆగస్టులో యుక్తి తరేజా Vs రితికా నాయక్.. ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్
-
IND vs ENG 3rd ODI: రోహిత్ శర్మను భయపెడుతున్న లార్డ్స్ గ్రౌండ్.. మరీ ఇంత దారుణమా!
-
Albino Cobra: శ్వేతనాగు రహస్యాలు వింటే వణికిపోతారు.. ఈ తెల్ల పాముల వెనుక దైవ శక్తి ఉందా?
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!