Akkineni Akhil: అక్కినేని నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగ్ సరసన సోనాల్ చౌహన్ నటించింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన మేకర్స్ నేడు కర్నూల్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ వేడుకకు అక్కినేని అందగాళ్లు నాగ చైతన్య, అఖిల్ గెస్టులుగా హాజరయ్యారు.
ఇక ఈ వేదికపై అఖిల్ మాట్లాడుతూ ” కర్నూల్ లో మీ అందరిని చూస్తుంటే ఎనర్జీ ఏంటో తెలుస్తోంది. నేను, అన్నయ్య ఒక గంట క్రితమే నాన్న గురించి మాట్లాడుకున్నాం.. ఆయనకు అస్సలు ఆకలి తగ్గదా ..? ఆ సినిమాలపై ఫ్యాషన్ తగ్గదా..? 30 ఏళ్లుగా అదే క్రమశిక్షణ.. అదే ఆకలితో పనిచేస్తున్నారంటే మాకు దైర్యం, మోటివేషన్ ఇంట్లోనే కూకుర్చున్నాయని అర్ధమయ్యింది. థాంక్యూ నాన్న.. మాకు ధైర్యాన్ని మోటివేషన్ ఇచ్చినందుకు.. ప్రవీణ్ సత్తారు కు థాంక్స్ చెప్పాలి. మా నాన్నను మేము ఎలా చూడాలనుకున్నామో మాకు అలా చూపించినందుకు. ఘోస్ట్ సినిమా గురించి చెప్పాలంటే . ఈ సినిమాలో ఫైర్ ఉంది.. అది మాటల్లో చెప్పేలేనిది. పోస్టర్, టీజర్, ట్రైలర్ ఏది చూసినా అందులో ఒక ఫైర్ ఉంది, ఇంటెన్సిటీ ఉంది అదే అక్టోబర్ 5 న మీ అందరూ చూడబోతున్నారు. చిత్ర బృందం మొత్తం రెండేళ్లు కష్టపడి పనిచేసింది.. ఈ సినిమాలో మీ హార్డ్ వర్క్ కనిపిస్తోంది. తప్పకుండ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొంటుందని నమ్ముతున్నాం. త్వరలో కలుద్దాం” అంటూ ముగించాడు.