Site icon NTV Telugu

Akhanda-2 : అఖండ-2 నుంచి తాండవం ఫుల్ సాంగ్ రిలీజ్

Thandavam

Thandavam

Akhanda-2 : అఖండ-2 సినిమా నుంచి బాలయ్య ఫ్యాన్స్ కు మంచి అప్డేట్ వచ్చింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాండవం సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. వారి కోసం ఫుల్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేసింది టీమ్. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇందులో బాలయ్య నిజంగానే తాండవం చూపించేశాడు. ఆయన పర్ఫార్మెన్స్, ఆ విజువల్స్ మాస్ ఆడియెన్స్ కు పూనకాలు తెప్పించేలా కనిపిస్తున్నాయి.

Read Also : SSMB 29 : పాసులుంటేనే రండి.. మహేశ్ బాబు స్పెషల్ రిక్వెస్ట్

ఈ పాటకు లిరిక్స్ కల్యాణ్ చక్రవర్తి రాయగా.. శంకర్‌ మహాదేవన్‌, కైలాశ్‌ ఖేర్‌, దీపక్‌ కలిసి పాడారు. డిసెంబర్ 5న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. బాలయ్య మరోసారి ప్రభంజనం సృష్టిస్తారని అంటున్నారు. ఈ సారి అఘోరా పాత్ర మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టి ఈ సినిమాను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. బాలయ్య, బోయపాటి కాంబోకు తిరుగులేదు. అది మరోసారి రిపీట్ అవుద్దా లేదా అనేది చూడాలి.

Read Also : Malaika Arora : పెళ్లికి ముందే కాబోయే వాడితో డేట్ చేయాలి.. నటి షాకింగ్ కామెంట్స్

Exit mobile version