Site icon NTV Telugu

Akhanda -2 : అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..

Akhanda 2

Akhanda 2

Akhanda -2 : నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వీరిద్దరి కాంబో అంటేనే మాస్ ఆడియన్స్‌కి పండుగ వాతావరణం. ఈ కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే విజయాన్ని మరింత భారీ స్థాయిలో కొనసాగించేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను ‘అఖండ 2’ తీసుకువస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘అఖండ 2’ డిసెంబర్ 5, 2025న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ అప్‌డేట్‌తో బాలయ్య ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

Read Also : OG : ఆ విషయంలో ఓజీ డైరెక్టర్ గ్రేట్.. పరుచూరి కామెంట్

ఇప్పటికే మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. బాలయ్య మరోసారి ఆధ్యాత్మిక శక్తుల తాలూకు పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న మాస్ హై వోల్టేజ్ ఎలిమెంట్స్‌కి మరింత ఎమోషన్, యాక్షన్, డివైన్ టచ్ జోడించబోతున్నారని సమాచారం. బాలయ్య ఇందులో అఘోరా పాత్రలో అదరగొట్టడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. మరి థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో ఈ మూవీ చూడాలి.

Read Also : Raviteja : ఏంటి.. రవితేజ రెమ్యనరేషన్ తీసుకోకుండా మూవీ చేస్తున్నాడా..?

Exit mobile version