Site icon NTV Telugu

Akhanda 2: ‘అఖండ–2’ ప్రీమియర్ షోలు రద్దు… బాలయ్య ఫ్యాన్స్ రచ్చ

Akhanda 2

Akhanda 2

Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ–2’ పై అభిమానుల్లో నెలకొన్న భారీ హైప్‌కు మధ్య, ప్రీమియర్ షోలు రద్దు కావడంతో రాజమండ్రి కాకినాడలలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టికెట్లు తీసుకుని థియేటర్లకు వెళ్లిన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. రాజమండ్రిలోని అశోక థియేటర్ వద్దకు బాలయ్య అభిమానులు ముందుగానే చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో ప్రీమియర్ షో రద్దయిందన్న సమాచారం రావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, వెంటనే షో నిర్వహించాలని అభిమానులు డిమాండ్ చేశారు.

India-Russia: ప్రోటోకాల్ పక్కన పెట్టి పుతిన్‌కు స్వాగతం పలికిన మోడీ !

కాకినాడలోని పద్మప్రియ, ఆనంద్ థియేటర్ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రీమియం షో వేయాలంటూ అభిమానులు థియేటర్ల వద్ద ఆందోళన చేశారు. షో రద్దు ప్రకటనతో ఫ్యాన్స్ మరింతగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో, థియేటర్ మేనేజ్‌మెంట్ పరిస్థితిని అదుపుచేయడానికి “డబ్బులు రీఫండ్ చేస్తాం, దయచేసి వెళ్లండి” అని విజ్ఞప్తి చేసింది. చాలా మంది అభిమానులు ప్రత్యేకంగా ప్రీమియర్ కోసం టికెట్లు బుక్ చేసుకున్నారని, ఇలా ఆఖరి నిమిషంలో రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. అఖండ-2 రేపు అన్ని థియేటర్లలో విడుదల కానుండగా.. ఈ రోజు ప్రీమియర్స్ షో నిర్వహించాల్సి ఉంది. అయితే.. కొని సాంకేతిక సమస్యల వల్ల ప్రీమియర్ షోలు ప్రదర్శించలేకపోతున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితి నెలకొంది.

PM Modi: మోడీ స్వయంగా స్వాగతించిన విదేశీ అతిథులు వీరే..

Exit mobile version