Thegimpu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, మంజు వారియర్ జంటగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తునీవు. తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ కానుంది. బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ కాంబోలో వలిమై సినిమా వచ్చిన సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ మోడ్ లో సాగిపోయింది. డబ్బు కోసం అజిత్ ఒక బ్యాంక్ ను కొల్లగొట్టాలనుకుంటాడు. దాని కోసం బ్యాంక్ లో ఉన్నారందరిని బందీలను చేస్తాడు. ఇక ఈ విషయం ప్రభుత్వానికి తెలియడం.. ఆ బ్యాంక్ లో కార్పొరేట్ సంస్థ షేర్స్ కోసం ఉంచిన డబ్బు కోట్లలో ఉండడంతో అజిత్ ను ఎలాగైనా అక్కడి నుంచి తప్పించాలని ప్రయత్నిస్తారు.
అసలు రా ఏజెంట్ అయిన అజిత్ కు ఈ బ్యాంక్ దోపిడీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. వాళ్ళ టీం మొత్తాన్ని బయట ఉంచి.. అజిత్ మాత్రమే లోపలకు ఎందుకు వెళ్ళాడు. అసలు ఆ డబ్బు ఎవరిది..? ఆ డబ్బు కోసం ఇంతమంది ఎందుకు వెంటపడ్డారు..? అంతకు తెగించి డబ్బు కోసం అజిత్ చేసిన రిస్క్ ఎవరి కోసం..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మొదటి నుంచి అజిత్ నెగెటివ్ పాత్రలోనే కనిపించాడు. ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నిస్తే అస్సలు లేదు అని ఈవిల్ స్మైల్ గ్యాంబ్లర్ సినిమాను గుర్తుచేసింది. ఇక రా ఏజెంట్ గా మఞ్చజు వారియర్ యాక్షన్ సీఎంస అదిరిపోయాయి. మొత్తానికి ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొనేలా చేశాడు దర్శకుడు. మరి ఈ సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య, విజయ్ ను దాటుకొని అజిత్ ఎలా నిలబడగలడో చూడాలి.