తమిళ స్టార్ హీరో అజిత్ ను అభిమానులంతా ముద్దుగా ‘తలా’ అనిపిలుస్తుంటారు. అయితే.. ఇక మీదట తన పేరు ముందు ఎలాంటి ప్రిఫిక్స్ లూ వద్దని చెబుతున్నాడు అజిత్. మక్కల్ తిలకం అని ఎంజీఆర్ ను, నడిగర్ తిలకం అని శివాజీ గణేశన్ ను, సౌతిండియా సూపర్ స్టార్ అని రజనీకాంత్ ను, ఉలగనాయకన్ అని కమల్ హాసన్ ను అభిమానులు సంభోదిస్తుంటారు. అలానే విజయ్ ను దళపతి అని, అజిత్ ను తలా అని సంభోదించడం వారికి ఎప్పటి నుండో అలవాటుగా మారిపోయింది. అయితే కారణం ఏమిటనేది చెప్పకుండానే ఇక మీదట తనను కేవలం అజిత్ లేదా అజిత్ కుమార్ లేదంటే సింపుల్ గా ఏకే అని మాత్రమే సంభోదించమని, ‘తలా’తో సహా మారే బిరుదులను తగిలించి పిలవొద్దని మీడియాను, జనరల్ పబ్లిక్ ను, జన్యూన్ ఫ్యాన్స్ నూ అజిత్ కోరాడు. ఓ స్టార్ హీరో అయ్యి ఉండి, అజిత్ తన డై హార్డ్ ఫ్యాన్స్ కు ఇలాంటి ఆంక్షలు పెడితే వాళ్ళు దాని మీద నిలబడం కాస్తంత కష్టమే. మరి త్వరలోనే అజిత్ సినిమా ‘వాలమై’ విడుదల కాబోతున్న దృష్ట్యా ఫ్యాన్స్ ఈ విషయంలో ఎంత నిబ్బరంగా ఉంటారో చూడాలి.