వరుస ప్లాప్స్ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఈ సినిమాతో తమిళనాడులో సంచాలనాలు నమోదు చేసాడు. ఆధిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. కాగా ఇప్పుడు నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై రోజుకొక వార్త వెలువడుతున్నాయి. హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు బాగా అలవాటు. శివ, హెచ్ వినోద్‌లకు గ్యాప్ లేకుండా బ్యాక్ తూ బ్యాక్ ఛాన్సులిచ్చాడు తలా. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు చేశాడు హెచ్ వినోద్.
Also Read : Ajith : గుడ్ బ్యాడ్ అగ్లి.. నెట్ ఫ్లిక్స్ లో అరాచకం
ఇక రీసెంట్ సూపర్ హిట్ గుడ్ బాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ తో మరో సినిమా చేసేందుకు అజిత్ రెడీ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. అధిక్ రవిచంద్రన్ మరోసారి అజిత్ కుమార్ ను డైరెక్ట్ చేయబోతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కథ చర్చలు కూడా ముగిశాయని టాక్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ లో షూటింగ్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు అజిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంచే ఛాన్స్ ఉంది. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా ఆధిక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఏకే 64 గురించి త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసే అవకాశాలున్నాయి. AK 64లో అజిత్ కుమార్ డ్యూల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని సమాచారం.