స్టార్ హీరోల సినిమాల నుంచి వచ్చే అప్డేట్ కోసం ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని రోజులైనా అప్డేట్ రాకపోతే ఆ హీరో అభిమానులు కోపంతో ఊగిపోతారు. అందుకే ఏ ప్రొడక్షన్ కంపెనీ అయినా స్టార్ హీరోతో సినిమా చేసే సమయంలో అప్డేట్స్ టైం టు టైం రిలీజ్ చేస్తూ ఉండాలి లేదంటే అభిమానుల నుంచి తిట్లు తప్పవు. ఈ విషయంలో ‘UV క్రియేషన్స్’కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రభాస్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన ఈ ప్రొడక్షన్ హౌస్ కి ప్రభాస్ ఫాన్స్ చుక్కలు చూపించారు. రీసెంట్ గా అల్లు అర్జున్ ఫాన్స్ కూడా ‘పుష్ప 2’ అప్డేట్ కోసం ‘గీత ఆర్ట్స్’ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు ‘అజిత్’ ఫాన్స్.
కోలీవుడ్ లో అజిత్ కి ఉండే ఫ్యాన్ బేస్ సైలెంట్ కాదు బాగా వయోలేంట్. తమ హీరోని ఏమైనా అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ‘వెర్బల్ వార్’కి దిగే అజిత్ ఫాన్స్, ట్విట్టర్ లో ‘బోణీ కపూర్’ని ట్యాగ్ చేసి రచ్చ చేస్తున్నారు. బోణీ కపూర్ ప్రొడక్షన్ లో అజిత్ ‘తునివు’ సినిమా చేస్తున్నాడు. హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తెస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. పొంగల్ రిలీజ్ అని ఒకటి రెండు పోస్టర్స్ కూడా వదిలారు. అంతే తమ హీరో సినిమా వస్తుంది అంటే అజిత్ ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు, వదిలిన ఒకటి రెండు పోస్టర్స్ తోనే బ్యానర్స్ కట్టించారు. తమిళనాడులో అజిత్ మేనియా స్టార్ట్ అయిపోయిందని ఫిక్స్ అయిపోయారు కానీ అలా జరగలేదు. జనవరి రిలీజ్ అంటే ‘తునివు’ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికీ మొదలవ్వాలి కానీ చిత్ర యూనిట్ మాత్రం సైలెంట్ గా ఉంది. ‘చిల్లా చిల్లా’ అనే సాంగ్ ని రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ మేకర్స్ ఆ సాంగ్ ని కూడా రిలీజ్ చేయలేదు, సినిమా ఏ తేదీనా ప్రేక్షకుల ముందుకి వస్తుంది అనే విషయాన్ని అనౌన్స్ చేయలేదు, టీజర్ ట్రైలర్ గురించి అయితే అసలు మాట్లాడకపోవడమే మంచింది.
నెల రోజుల్లో రిలీజ్ అవ్వాల్సిన ఒక స్టార్ హీరో సినిమాకి ప్రమోషన్స్ చేయకుంటే ఆ ఫాన్స్ సైలెంట్ గా ఉండడం కష్టమే. అందుకే అజిత్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అజిత్ పీఆర్వో అయిన ‘సురేష్ చంద్ర’ని పేరున #worstprosureshchandra అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు. #wewantthunivuupdate #thunivuupdate ఇలా రెండు మూడు హాష్ టాగ్స్ క్రియేట్ చేసి ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. నిజానికి అజిత్ ఫాన్స్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. అజిత్ లాస్ట్ మూవీ ‘వలిమై’ సినిమా సమయంలో కూడా అప్డేట్స్ కావాలి అంటూ రచ్చ రచ్చ చేశారు. దీంతో అజిత్ ‘ఓపిక’తో ఉండండి అంటూ ఓపెన్ లెటర్ నే రిలీజ్ చేయాల్సి వచ్చింది. మరి ‘తునివు’ విషయంలో జరుగుతున్న దానికి అజిత్ స్పందిస్తాడా? లేక ప్రొడ్యూసర్, డైరెక్టర్ స్పందిస్తారా అనేది చూడాలి.