Ajay Devgn: ఒక్క సినిమా ఎనిమిది సార్లు వాయిదా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దృశ్యం 2 సినిమాతో 250 కోట్లు రాబట్టి సూపర్ హిట్ కొట్టిన అజయ్ దేవగన్, లేటెస్ట్ గా భోలా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఖైదీ రీమేక్ గా తెరకెక్కిన భోలా సినిమా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసింది. భోళా ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి అజయ్ దేవగన్ ‘మైదాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇండియన్ ఫుట్ బాల్ టీం మాజీ ప్లేయర్ అండ్ కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ బయోపిక్ గా ‘మైదాన్’ సినిమా తెరకెక్కింది.
పాన్ ఇండియా రేంజులో రూపొందిన ఈ మూవీ గతేడాది జూన్ లోనే రిలీజ్ అవ్వాల్సింది. అనివార్య కారణాల వలన ఒకటి కాదు రెండు ఏకంగా ఇప్పటివరకూ ఏడు సార్లు మైదాన్ సినిమా వాయిదా పడింది. కొంతమంది సినీ అభిమానులైతే మైదాన్ సినిమాని మర్చిపోయి ఉంటారు కూడా. ఏడు సార్లు వాయిదా వేసిన తర్వాత ఈసారి మైదాన్ సినిమాని గ్యారెంటీగా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ‘జూన్ 23’ని కొత్త రిలీజ్ డేట్ గా అనౌన్స్ చేసారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ప్రమోషన్స్ చెయ్యకుండా మేకర్స్ సైలెంట్ గా ఉండడంతో మైదాన్ సినిమా ఎనిమిదో సారి కూడా వాయిదా పడింది అనే మాట వినిపిస్తోంది. ఇదే జరిగితే మైదాన్ సినిమా థియేటర్ బిజినెస్ కి చాలా నష్టం వస్తుంది. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా హైప్ రావడం అయితే కష్టమే.
Also Read
అమిత్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై అజయ్ దేవగన్ కి చాలా హోప్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ జోనర్ సినిమాలకి బౌండరీలు ఉండవు, ఎమోషన్ కనెక్ట్ అయితే చాలు భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ జరిగిపోతుంది. ఇలాంటి మ్యాజిక్ కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ లైఫ్ లో చాలానే ఉంది. వృత్తి పరంగా టీచర్ అయిన ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ ఇండియన్ ఫుట్ బాల్ టీంలో ఒకప్పుడు ప్లేయర్, ఆ తర్వాత 1950 నుంచి 1963 వరకూ కోచ్ గా వ్యవహరించాడు. ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ కోచ్ గా ఉన్న సమయం ఇండియన్ ఫుట్ బాల్ హిస్టరీలోనే గోల్డెన్ ఫేజ్ గా చెప్పుకోవచ్చు. ఒలంపిక్స్ లో ఆషియా నుంచి సెమిస్ చేరిన మొదటి టీంగా ఇండియ హిస్టరీ క్రియేట్ చేసింది. 1951, 1962లో ఏషియన్ చాంపియన్షిప్ లో ఇండియా గోల్డ్ మెడల్స్ ని కూడా గెలిచింది. ‘ది ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడరన్ ఇండియన్ ఫుట్ బాల్’ గా పేరు తెచ్చుకున్న ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ పాత్రలో అజయ్ దేవగన్ అద్భుతంగా నటించాడని ఇప్పటికే బాలీవుడ్ కథనాలు ప్రచురించింది. మరి అంత మంచి సినిమాని విడుదల చేయకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నారో మేకర్స్ కే తెలియాలి.
తాజావార్తలు
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!