ఇటీవలి కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా రజనీకాంత్ కుమార్తె, చిత్రనిర్మాత ఐశ్వర్య ఆర్ ధనుష్ కూడా కరోనా సోకినట్లుగా నిర్ధారించింది. ఆమె తన సోషల్ మీడియాలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, COVID-19 సోకినట్లు అభిమానులకు తెలియజేసింది. పరీక్షలో పాజిటివ్ వచ్చిన తర్వాత ఆసుపత్రిలో చేరినట్లు ఐశ్వర్య వెల్లడించింది. ఈ మేరకు ఓ పిక్ ను పంచుకుంటూ “అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్‌గా తేలింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. దయచేసి టీకాలు వేసుకోండి. సురక్షితంగా ఉండండి” అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన వెంటనే ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు.
Read Also : రాజమౌళి మొదలుపెట్టాడు.. అందరూ అదే పాటిస్తున్నారు
కాగా రీసెంట్ గా ఐశ్వర్య, ధనుష్ 18 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకోవడంతో వార్తల్లో నిలిచారు. అయితే వీరిద్దరూ విడాకుల విషయాన్ని అయితే ప్రకటించారు. కానీ ఐశ్వర్య తన పేరులో నుంచి ఇంకా ధనుష్ పేరును తొలగించలేదు. దీంతో వీరు మళ్ళీ కలవాలని అంతా కోరుకుంటున్నారు.