Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Adivi Sesh Mrunal Thakur Dacoit Ott Release Date Amazon Prime Video

Dacoit OTT Release Date: అడివి శేష్‌ ‘డెకాయిట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

Published Date :May 3, 2026 , 4:41 pm
By Shiva Ganesh
Dacoit OTT Release Date: అడివి శేష్‌ ‘డెకాయిట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dacoit OTT Release Date: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ – మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘డెకాయిట్’. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర OTT విడుదలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ‘డెకాయిట్’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మే 8వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, కన్నడ మలయాళ భాషల్లో మే 8 నుంచి అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ మరికొన్ని రోజులు ఆలస్యంగా ఉండబోతోందని టాక్.

గతంలో ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని వార్తలు వచ్చినప్పటికీ, చివరి నిమిషంలో ప్రైమ్ వీడియో ఈ రేసులో గెలిచినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రం అడివి శేష్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. దీనిని తెలుగు, హిందీ భాషల్లో బైలింగువల్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించగా.. ప్రకాష్ రాజ్, అతుల్ కుల్కర్ణి, సునీల్, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. యాక్షన్, ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులను ఇప్పుడు OTTలో అలరించడానికి సిద్ధమైంది.

Also Read

  • Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!
  • Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత - నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!
  • Latheesh: ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజుల నుంచి టాలీవుడ్ విలన్ దాకా!
  • NBK112 : బాలయ్య - కొరటాలశివ సినిమాకు అనిరుధ్ సంగీతం?

డెకాయిట్ కథ:
హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్), కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ. తాను ప్రేమించి, ఆమె చేతిలో మోసపోయిన జూలియట్ అలియాస్ సరస్వతి (మృణాల్ ఠాకూర్) మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావిస్తూ ఉంటాడు. శిక్ష ముగించుకుని బయటకు వెళ్లిన తన జైల్ మేట్ (అతుల్ కులకర్ణి) సహాయంతో జైలు నుంచి తప్పించుకున్న హరి, తాను పగ తీర్చుకోవాలనుకున్న జూలియట్ మీద పగ తీర్చుకున్నాడా? అసలు ప్రాణంగా ప్రేమించిన జూలియట్ హరిని ఎందుకు వదిలేసింది? తన భర్త ప్రాణాలు దక్కించుకోవడానికి పోరాడుతున్న జూలియట్, భర్త ప్రాణాలను దక్కించుకున్నదా? ఆమె మీద పగ తీర్చుకోవడం కోసమే బయటకు వచ్చిన హరి, ఆమె మీద పగ తీర్చుకున్నాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adivi Sesh Dacoit Streaming Partner
  • Adivi Sesh Mrunal Thakur Film
  • Dacoit Movie Amazon Prime
  • Dacoit OTT Release Date
  • Dacoit Plot Summary

తాజావార్తలు

  • Dacoit OTT Release Date: అడివి శేష్‌ ‘డెకాయిట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

  • KKR Vs SRH: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. పట్టుబిగించిన కేకేఆర్..

  • AI Viral Story: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్‌‌గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..

  • Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..

  • Rajasthan Royals Owner: రాజస్థాన్ రాయల్స్ కొత్త ఓనర్‌గా బిలియనీర్ లక్ష్మీ మిట్టల్.. రూ.15,660 కోట్లతో డీల్!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions