AI Viral Story: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్‌గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
- సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎసరుపెడుతున్న ఏఐ..
- 18 ఏళ్ల అనుభవం ఉద్యోగికి ఉద్వాసన..
- కుటుంబం కోసం వెయిటర్‌గా ఉద్యోగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Viral Story: టెక్ రంగంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వచ్చిన తర్వాత టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. మానవజీవితం మరింత సులువు అవుతోంది. ఇదే సమయంలో ఏఐ ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు అన్ని కంపెనీలు తమ లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి.
తాజాగా ఉద్యోగం కోల్పోయిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన పరిస్థితిని వివరిస్తూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. దాదాపు 18 ఏళ్లు అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఏఐ కారణంగా తన ఉద్యోగం పోయిందని పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను మెక్‌డొనాల్డ్స్ వెయిటర్‌గా పనిచేస్తున్నట్లు రెడ్డిట్ పోస్ట్‌లో రాశారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Read Also: Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
తాను 18 ఏళ్ల సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేశానని, అయితే 8 నెలల క్రితం ఉద్యోగం కోల్పోయినట్లు చెప్పాడు. కంపెనీ 12 మంది ఇంజనీర్ల టీమ్‌ను తొలగించి, ఇద్దరు ఏఐ నిపుణుల్ని నియమించుకుందని, అప్పటి నుంచి 100కు పైగా ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నప్పటికీ, ఇంకా కొత్త ఉద్యోగం రాలేదని చెప్పారు. ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఇంటి రెంట్ చెల్లించడానికి మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇంటర్వ్యూల్లో అనేక అనుభవవాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాను చెప్పే సమాధానాలతో ఇంటర్వ్యూయర్లు నచ్చడం లేదని, డెవలపర్ల పని అయిపోయిందని, కంప్యూటర్ సైన్స్ డిగ్రీకి ఇప్పుడు విలువ లేదని నిర్మొహమాటంగా చెబుతున్నారని అతను వెల్లడించారు. తన లాంటి చాలా మంది ఇంజనీర్లు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
ఇప్పుడు ఏఐ వల్ల కంపెనీలు తక్కువ మందితో పనికానిచ్చేస్తోందని, ఎక్కువ మంది ఉద్యోగుల్ని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఏఐ టూల్స్ ఉపయోగించాలని చాలా కంపెనీలు కోరతున్నాయి. ప్రస్తుతం టెక్ రంగం ఏఐపై పట్టు సాధిస్తేనే ఉద్యోగాలు ఉండే పరిస్థితి నెలకొంది. ఇంటర్వ్యూల్లో ఏఐ గురించి, దాని ఉపయోగించడం గురించి తెలియని వాళ్లు వెనకబడిపోతున్నారు.

తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!