Dacoit OTT Release Date: అడివి శేష్ ‘డెకాయిట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dacoit OTT Release Date: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ – మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘డెకాయిట్’. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర OTT విడుదలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ‘డెకాయిట్’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మే 8వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, కన్నడ మలయాళ భాషల్లో మే 8 నుంచి అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ మరికొన్ని రోజులు ఆలస్యంగా ఉండబోతోందని టాక్.
గతంలో ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని వార్తలు వచ్చినప్పటికీ, చివరి నిమిషంలో ప్రైమ్ వీడియో ఈ రేసులో గెలిచినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రం అడివి శేష్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. దీనిని తెలుగు, హిందీ భాషల్లో బైలింగువల్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించగా.. ప్రకాష్ రాజ్, అతుల్ కుల్కర్ణి, సునీల్, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. యాక్షన్, ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులను ఇప్పుడు OTTలో అలరించడానికి సిద్ధమైంది.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
డెకాయిట్ కథ:
హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్), కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ. తాను ప్రేమించి, ఆమె చేతిలో మోసపోయిన జూలియట్ అలియాస్ సరస్వతి (మృణాల్ ఠాకూర్) మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావిస్తూ ఉంటాడు. శిక్ష ముగించుకుని బయటకు వెళ్లిన తన జైల్ మేట్ (అతుల్ కులకర్ణి) సహాయంతో జైలు నుంచి తప్పించుకున్న హరి, తాను పగ తీర్చుకోవాలనుకున్న జూలియట్ మీద పగ తీర్చుకున్నాడా? అసలు ప్రాణంగా ప్రేమించిన జూలియట్ హరిని ఎందుకు వదిలేసింది? తన భర్త ప్రాణాలు దక్కించుకోవడానికి పోరాడుతున్న జూలియట్, భర్త ప్రాణాలను దక్కించుకున్నదా? ఆమె మీద పగ తీర్చుకోవడం కోసమే బయటకు వచ్చిన హరి, ఆమె మీద పగ తీర్చుకున్నాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..