కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో ‘అడివి శేష్’. శేష్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ని చూడబోతున్నాం అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్ డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన శేష్, రీసెంట్ గా ‘హిట్ 2’ సినిమాతో మరో సాలిడ్ హిట్ కొట్టాడు. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి వచ్చిన ‘హిట్ 2’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారానికి బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యింది. మరో సినిమా పోటీ లేకపోవడంతో ‘హిట్ 2’ మూవీ అన్ని సెంటర్స్ లో రెండు వారాలుగా సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రాఫిట్స్ రాబడుతున్న ‘హిట్ 2’ మూవీ ఓవర్సీస్ లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఓవర్సీస్ మార్కెట్ లో వన్ మిలియన్ మార్క్ టచ్ చేసిన ‘హిట్ 2’ మూవీ ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తోంది. అడివి శేష్ కెరీర్ లో రెండో మిలియన్ మార్క్ రీచ్ అయిన సినిమాగా ‘హిట్ 2’ రికార్డ్స్ కి ఎక్కింది. ఈ మూవీ కన్నా ముందు ‘మేజర్’ మూవీతో శేష్ మిలియన్ మార్క్ ని రీచ్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు ఓవర్సీస్ లో అడివి శేష్ మార్కెట్ ని పెంచాయి. ముఖ్యంగా ‘హిట్ 2’ మూవీ ‘ఏ’ సర్టిఫికేట్ తో మిలియన్ మార్క్ ని టచ్ చెయ్యడం విశేషం. ‘ఏ’ సర్టిఫికేట్ ఉన్న సినిమాలు మిలియన్ మార్క్ ని టచ్ చెయ్యడం చాలా రేర్, గతంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా మాత్రమే ఆ మార్క్ ని రీచ్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ‘ఏ’ సర్టిఫికేట్ తో మిలయన్ మార్క్ ని రీచ్ అయిన మూవీ ‘హిట్ 2’ మాత్రమే. ఈ రేర్ ఫీట్ ని సాదించిన శేష్ పై, ఫ్యూచర్ లో అతను చేయబోయే సినిమాపై ఓవర్సీస్ ఆడియన్స్ లో అంచనాలు మరింత పెరుగుతాయి. వాటిని అందుకోవడానికి ఈ థ్రిల్లింగ్ హీరో ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది చూడాలి.