Adivi Sesh: ఒకరిని 150 మంది కలిపి కొట్టారు.. డెకాయిట్ బయటకు రప్పించింది!
అడివి శేష్ లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’లో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. శానిల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.
హీరో అడివి శేష్ మాట్లాడుతూ… ‘డెకాయిట్’ బెంగళూరు సెలబ్రేషన్స్‌లో ఉన్నప్పుడు కొంతమంది కలిశారు. తమిళనాడుకు చెందిన ఒక లాయర్ కలిసి తనకు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాడు. తనను ఎవరో 150 మంది కలిసి కొట్టారట. చాలాకాలం హాస్పిటల్‌లో ఉన్నాడు. బయటకు రావాలంటే భయమేసిందని, తనకు ధైర్యం ఇచ్చింది ‘మేజర్’ సినిమా అని చెప్పాడు. ‘డెకాయిట్’ రిలీజ్ అవుతుందని తెలుసుకుని హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి మొదటిగా ఈ సినిమానే చూశానని చెప్పాడు. సినిమా చాలా నచ్చిందని, నన్ను కలవడానికి ప్రత్యేకంగా వచ్చానని చెప్పాడు. చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థమైంది.. మనము సినిమా, బిజినెస్ గురించి ఆలోచిస్తూ మానవత్వాన్ని ఎక్కడో మర్చిపోతాం. ఆయన నాకు ఆ మానవత్వాన్ని మళ్లీ గుర్తు చేశాడు. నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో గుర్తు చేశాడు. అలాగే ‘మేజర్ సందీప్’ ఫ్యాన్ పేజ్ నిర్వహిస్తున్న వారు ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో పెట్టుకోమని నాకు ఇండియన్ ఫ్లాగ్ ఇచ్చారు. ఇంత ప్రేమను ప్రేక్షకులు, మీడియా నుంచి పొందుతున్నప్పుడు.. ఇదే క్రెడిబిలిటీ అనిపిస్తుంది. హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. అందుకే నాకు ‘గుడ్ సినిమా’ శేష్ అనే ట్యాగ్ రావాలని కోరుకున్నాను. అలాంటి సంతృప్తి ఈ సినిమా ఇచ్చింది. ఆ బెంగళూరులో ఆ లాయర్ ని కలిసినప్పుడు వచ్చిన అనుభూతి నాకు ఒక షీల్డ్‌లా అనిపించింది అన్నారు.
తాజావార్తలు
-
Jasprit Bumrah: పిచ్చినవ్వు.. భూమిని తన్నడం.. బుమ్రాను ఇలా ఎప్పుడూ చూడలేదు బ్రో..(వీడియోలు)
-
Adivi Sesh: ఒకరిని 150 మంది కలిపి కొట్టారు.. డెకాయిట్ బయటకు రప్పించింది!
-
Toyota Yaris Cross facelift: టయోటా యారిస్ క్రాస్ 2026 ఫేస్‌లిఫ్ట్.. కొత్త లుక్, హైబ్రిడ్ మ్యాజిక్!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఎల్లుండే ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు..
-
CheQ AU Credit Card: పేమెంట్ చేయగానే గ్రీన్ లైట్.. భారత్ లో మొదటి LED కో-బ్రాండెడ్ కార్డు
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!