Adivi Sesh: నాకు డబ్బు పిచ్చి లేదు.. అందుకే చాలా పెద్ద ఆఫర్ రిజెక్ట్ చేశా: అడివి శేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adivi Sesh Birthday Special Interview: యంగ్ డైనమిక్ హీరో అడివి శేష్ వైవిధ్యమైన చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకుంటూ పాన్ ఇండియా ఫేం సంపాదించుకున్నారు. హిట్ 2, మేజర్ లాంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత ప్రస్తుతం గూఢచారి 2, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న #SeshExShruti లాంటి మరో రెండు బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఆదివారం నాడు డిసెంబర్ 17 అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
శేష్.. 2023 ఎలా గడించింది ?
-2023 మొత్తం ప్రిపరేషన్ లోనే గడిచింది, గూఢచారి 2 తో పాటు నేను, శ్రుతి హాసన్ కలిసి చేస్తున్న సినిమాకు రైటింగ్, ప్రిపరేషన్ ఇలా చాలా వర్క్ చేశాం.
Also Read
- Varun Tej : 'ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు'.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
- CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
- OG 2 Update: పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
- Deepika Padukone: 'రాకా'.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
మీ నుంచి 2023లో ఒక్క సినిమా కూడా రాలేదు, ఏమైనా ఫీలింగ్ ఉందా ?
-అలాంటి పట్టింపు ఏమీ లేదని, పేస్ బౌలర్స్ అందరికీ ఒకే స్పీడ్ వుండదు కదా. ప్రతి మనిషి వాళ్ళకి వాళ్ళ స్పీడ్ ఉంటుంది, చేసింది బాగుండాలి అదే ముఖ్యం. అయితే మేజర్, హిట్ 2 బ్యాక్ టు బ్యాక్ వచ్చినట్లు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తాయి.
మీ ప్రయాణం ఎక్కడి వరకు వచ్చింది అని అలోచిస్తుంటారా ?
-జర్నీ ఎక్కడివరకూ వచ్చిందనే దాని కంటే ఆ జర్నీలో ఎంత ఆనందిస్తున్నామనేది ముఖ్యం, చాలా కాలం ఇది చేయాలి, అది చేయాలి అని పరుగులో ఉండిపోయా, దీంతో జ్ఞాపకాలు ఉండేవి కాదు. దేనిని ఆస్వాదించే సమయం ఉండేది కాదు, ఇప్పుడు అనుభూతి చెందాలని కోరుకుంటున్నా, అందుకే దేనిపై ఎక్కువ ఒత్తిడి తీసుకోను.
ఒకప్పుడు బడ్జెట్ పరిమితులు ఉండేవి కానీ ఇప్పుడు మీ మార్కెట్ ఓపెన్ అయ్యింది కదా ఈ ఫేజ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
-ఇదంతా ప్రేక్షకుల అభిమానం, ఆదరణ వారు చూపిన ప్రేమ వలన సాధ్యపడింది, ఇది ఖచ్చితంగా మన హార్డ్ వర్క్ వలన సంపాదించామని చాలా ఆనందంగా వుంది.
మీ మేజర్ సినిమా హిందీలో విడుదలయింది, అలాగే ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు హిందీలో రాబోతున్నాయి. ఇకపై మీ సినిమాలన్నీ హిందీలో ఖచ్చితంగా విడుదలౌతాయా?
-అది సినిమా సబ్జెక్ట్ బట్టి వుంటుంది, జి2 చాలా మ్యాసీవ్ ఫిల్మ్. ఐదు దేశాల్లో జరిగే కథ. ఆ స్కేల్ స్పాన్ కి హిందీ ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుందని నమ్మకం వుంది. శ్రుతి హాసన్ తో చేస్తున్న సినిమా ప్రాపర్ గా హిందీ, తెలుగు.. రెండు భాషల్లో సెపరేట్ గా షూట్ చేస్తున్నాం, కల్చర్ ప్రకారం ప్రతి సీన్ ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. నటి నటీనటుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, తెలుగు, హిందీ .. రెండు భాషలపై పట్టు ఉన్న నటులని ఎంపిక చేశాం.
మేజర్ చాలా పెద్ద హిట్ అయ్యింది కదా.. ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి ఎంత సమయం పట్టింది?
-నిజానికి సినిమా కోసం ప్రయాణం మొదలైయింది, కానీ ఆ కుటుంబం నాలో భాగమైపోయింది. అంకుల్, ఆంటీ నాకు ఫ్యామిలీ అయిపోయారు, ఇది ఎప్పటికీ నాతో ఉంటుంది. 26/11 కి ముంబై వెళ్లా, రోజంతా వాళ్లతో ఉన్నా.
మీ చిత్రాలకు రచన విభాగంలో కూడా పాలుపంచుకున్నారు కదా.. దర్శకత్వంలో మీ అన్వాల్మెంట్ ఏ మేరకు ఉంటుంది ?
నేను గుడ్ యాక్టర్, గ్రేట్ రైటర్, బ్యాడ్ డైరెక్టర్ అని ఫీలవుతా, దర్శకుడికి చాలా ఓర్పు కావాలి. నేను ప్రతిది మనసుతో ఆలోచిస్తా, అది నటుడిగా చేయాల్సిన పని. కానీ దర్శకుడు మెదడుతో అలోచించాలి, అదొక డిఫరెంట్ స్కిల్ సెట్. నేను యాక్టింగ్ రైటింగ్ ప్రిఫర్ చేస్తా, నేను రాసే కథలు కూడా కేవలం నా కోసమే. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాల తర్వాత కేవలం నటుడిగానే మరో రెండు చిత్రాలు చేయబోతున్నా.
రచయితే నటుడు కావడంలో వున్న సౌలభ్యం ఏమిటి ?
కొన్నిసార్లు రచయిత అలోచించాలా లేదా నటుడిగా అలోచించాలనే డైలమా వచ్చేస్తుంది, అందుకే కథ రాసేటప్పుడు మనల్ని మనం నటుడిగా ఎప్పుడూ చూడకూడదు. కథకు ఏది అవసరమో అదే రాయాలి, పదేళ్ళుగా నాను నేను ఇలాంటి కసరత్తు చేసుకున్నా. రాసిన సీన్ ని ఎలా చూపించాలనేది యాక్టర్ గా మాత్రమే అలోచించాలి, ఇలా విడిగా ఉండటం నాకు చాలా నీట్ గా ఉంటుంది.
గూఢచారి 1కి, 2కి లింక్ ఉంటుందా ?
-మీకో స్పాయిలర్ చెప్పేస్తా, గూఢచారి 2 మంచుకొండల్లో మొదలౌతుంది. ఈ సినిమాకు సీక్వెల్ కథ రాసుకున్నప్పుడు అనుకున్నాను, ఐతే ముందు ఆడియన్స్ మన సినిమాకి సీక్వెల్ కోరుకోవాలి. వాళ్ళు అడిగినప్పుడు అనౌన్స్ చేస్తే అందులో వున్న కిక్ వేరు.
సినిమాల ఎంపిక విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు. ఈ మధ్య చాలా పెద్ద ఆఫర్ ని రిజెక్ట్ చేశారు అని తెలిసింది. నిజమేనా ?
-ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించవచ్చు. మంచి సినిమాలు చేయవచ్చు, చాలా అరుదుగానే కొంతమందికే మంచి సినిమాలపై డబ్బు చేసుకోవడం కుదురుతుంది. నాకు మనీ మీద పెద్ద క్రేజ్ లేదు, ఫ్రెండ్స్ కూడా ఈ విషయంలో నన్ను తిడతారు. అందుకే సహజంగానే కేవలం మంచి సినిమాపైనే దృష్టి వెళ్ళిపోతుంది. నా దృష్టి ఎప్పుడూ సినిమా చూస్తున్న ఆడియన్స్ ఎలా ఫీలవుతారు అనే దానిపైనే ఉంటుంది. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా చాలా సెలెక్టివ్ సినిమాలు చేస్తున్నా.
మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టారు,. ఇప్పుడు మళ్ళీ అలాంటి రోల్స్ వస్తే ఇతర సినిమాల్లో చేయడానికి అంగీకరిస్తారా ?
సినిమాలో ఏ పాత్ర అయినా సరే.. ఆ కథని, సినిమా క్యారీ చేయగలగాలి, అలాంటి పాత్రలు వస్తే ఖచ్చితంగా చేస్తాను.
శ్రుతి హాసన్ తో చేస్తున్న సినిమా ఎలా ఉండబోతుంది ?
వెరీ ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీ. హైలీ ఎమోషనల్ యాంగ్రీ ఫిలిం, చాలా న్యూ జోనర్ ఫిల్మ్.
ఈ సినిమాతో షానీల్ డియో దర్శకుడిగా పరిచయం చేయాలనే ఆలోచన మీదేనా ?
క్షణం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాడు, అది ఆల్రెడీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంపికయింది అని కూల్ గా చెప్పాడు. తనలో అంత ప్రతిభ ఉందా అని సర్ప్రైజ్ అయ్యాం, తన లక్ష్యమే దర్శకత్వమని చెప్పాడు. అప్పటినుంచే తనని దర్శకుడిగా పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యా.
తాజావార్తలు
-
Varuna Yagam: నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
-
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
-
Jantar Mantar: జంతర్ మంతర్‌లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
-
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!