శ్రీఆదిత్య హీరోగా, రమ్య, పవిత్ర, మాధురి హీరోయిన్లుగా చిన్నబాబు అడపా నిర్మిస్తున్న చిత్రం ‘ఆదిత్య టి-20 లవ్ స్టోరీ’. లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి చిన్ని చరణ్ అడపా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ‘ఆదిత్య టి-20 లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా కొత్తగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్లు తెలిపారు.
ప్రభు తాళ్లూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా చిన్నబాబు అడపా, మ్యూజిక్ డైరెక్టర్‌గా చిన్ని చరణ్ అడపా, ఎడిటర్‌గా ఎంఆర్ వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి పాటలను వేల్పుల వెంకేటేష్ రాయగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అభిషేక్ రూఫస్ సమకూరుస్తున్నారు. వియఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ను అఖిల్ (ఎ.ఎస్.డి.) అందిస్తున్నారు. విజయ రంగరాజు, దత్తు, రాజనాల, అప్పారావు, మేరీ భావన తదితరులు ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు.