Bandi: విడుదలకు రెడీ అయిన ‘బంధీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేక్షకులు ప్రస్తుతం రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్న క్రమంలో ఆదిత్య ఓం ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన బంధీ అనే సినిమా రిలీజ్‌కు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. సింగిల్ క్యారెక్టర్‌తో బంధీ అనే చిత్రాన్ని చేశారు ఆదిత్య ఓం. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మించగా.. తిరుమల రఘు దర్శకత్వం వహించారు. పర్యావరణ సంరక్షణ, ప్రకృతి గొప్పదనం చాటి చెప్పేలా ఈ మూవీ ఉండబోతోంది. ఇది వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పోస్టర్లు, ట్రైలర్ సినిమాలోని డెప్త్‌ను చాటాయి. ఇక ఈ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉంది. నేచురల్ లొకేషన్స్‌లో ఈ మూవీని షూట్ చేశారు. దేశంలోని వివిద అటవీ ప్రాంతాల్లో కష్టాలు పడుతూ, ఎటు వంటి డూప్స్ లేకుండా ఆదిత్య ఓం చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి. ప్రకృతిని నాశనం చేస్తున్న మానవాళికి ఓ కనువిప్పులా ఈ చిత్రం ఉండబోతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు మేకర్లు తీసుకు రానున్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Lenin: ‘వస్తున్నాం… మనోడు కొడుతున్నాడు’.. అఖిల్ సినిమాపై నాగార్జున బ్లాక్‌బస్టర్ హుకుం!
-
Mumbai Heavy Rains: దంచికొట్టిన వాన.. 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షం.. నేడు స్కూల్స్ కు సెలవు..!
-
Astrology: జూలై 6 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!