NTV Telugu Site icon

Adipurush: ‘ఆదిపురుష్’ ఫలితాలపై వేణు స్వామి చెప్పిందే నిజమవుతుందా?

Venu Swamy And Prabhas News

Venu Swamy And Prabhas News

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్.. ప్రముఖ బాలివుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమా తెరకేక్కిస్తున్నారు.. రామాయణం కథ ఆధారంగా తెరకేకుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే..ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ కోసం ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచుస్తున్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ మూవీ ఫలితం గురించి వేణుస్వామి షాకింగ్ కామెంట్లు చేశారు… వేణు స్వామి ఏం చెప్పినా కూడా నిజం అవుతున్న నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఆయన ఏమన్నారంటే.. ప్రభాస్ జాతకరిత్యా ఆదిపురుష్ మూవీ సంచలనాలు సృష్టించే అవకాశం అయితే లేదని వేణుస్వామి అన్నారు. బాహుబలి స్థాయి హిట్ ను ఆశించవద్దని ఆయన పేర్కొన్నారు. ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని అన్నారు.. కేవలకు నచ్చితే సినిమా హిట్ అవుతుందని ఆయన చెబుతున్నారు.. శాకుంతలం సినిమాను రాజమౌళి తీసి ఉంటే ఆస్కార్ వచ్చేదని ఆయన తెలిపారు. రాజమౌళి చేసిన విధంగా సినిమాను మార్కెటింగ్ ఎవరూ చేయరని వేణుస్వామి చెప్పుకొచ్చారు. పది పైసల విషయాన్ని 100 రూపాయలుగా కన్వర్ట్ చేయగల శక్తి జక్కన్నకు ఉందని ఆయన తెలిపారు…

రాజమౌళి ఏం చేసిన కూడా సంచలనమే అవుతుందని ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆయన జాతకం అలా ఉందని వేణుస్వామి అన్నారు.. ప్రస్తుతం ప్రభాస్ 150 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని వేణుస్వామి వెల్లడించారు. తారకరత్న మరణాన్ని ముందే ఊహించానని ఆయన పేర్కొన్నారు. హీరోయిన్లు పుట్టినరోజు విషయంలో ఇయర్ తప్పు చెబుతారని వేణుస్వామి వెల్లడించారు.. అంతేకాదు మరో మూడేళ్లలో మరో హీరో ఆత్మహత్య చేసుకొని చనిపోతాడని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.. మరి ఆ హీరో ఎవరో అని జనాలు జుట్లు పీక్కుంటున్నారు.. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆయన పై పీకలదాకా కోపంతో రగిలిపోతున్నారు..

Show comments