NTV Telugu Site icon

Adipurush 1st Day Collections: ‘ఆదిపురుష్’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. క్రేజ్ మాములుగా లేదుగా!

Untitled Design (2)

Untitled Design (2)

Adipurush Movie 1st Day Collections: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్ హీరోయిన్‌ కృతీ సనన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని.. ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టి సిరీస్ బ్యాన‌ర్‌పై భూష‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్‌ రాఘవుడిగా, కృతీ సనన్‌ జానకిగా నటించగా.. సైఫ్‌ అలీ ఖాన్‌ లంకేశ్వరుడిగా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 16) రిలీజ్‌ (Adipurush Release Date) కానుంది. మరికొద్ది గంటల్లో ఆదిపురుష్‌ విడుదల కానున్న నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఫాన్స్ నానా హంగామా చేస్తున్నారు. దాంతో సోషల్‌ మీడియాలో ఆదిపురుష్‌ హ్యాష్‌ ట్యాగ్‌ (#AdipurushBookings, #Prabhas𓃵, #AdipurushOnJune16) ట్రెండింగ్‌లో ఉంది.

తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో ఆదిపురుష్‌ సినిమా రిలీజ్ కానుంది. దాంతో సినీ ప్రేక్ష‌కులు, ట్రేడ్ వ‌ర్గాలు ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇప్పుడు బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. బాహుబ‌లి అనంతరం వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాల‌కు మొదటి రోజు కలెక్ష‌న్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు ఆదిపురుష్ అంతకు మించి రాబట్టేలా ఉంది. రామాయణం ఆధారంగా వస్తున్న సినిమా కావడంతో సినిమాకు అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. దీంతో మొదటి రోజు క‌లెక్ష‌న్స్ బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌నుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

Kolkata Airport: కోల్‌కతా విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం.. 

విశ్లేష‌కుల అంచ‌నాల ప్రకారం… ఆదిపురుష్ సినిమా తొలి రోజున హిందీలో దాదాపు రూ. 30-32 కోట్ల మేర‌ క‌లెక్షన్స్‌ను రాబట్టే అవకాశం ఉంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో మొదటి రోజు రూ. 60 నుంచి 70 కోట్ల వ‌సూళ్లు అవుతాయని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమాకు రూ. 120-140 కోట్ల మేర‌కు నెట్ క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నాలు వేస్తున్నాయి. మొదటి షో పడ్డాక ఈ అంచనాలు నిజం అవుతాయో లేదో తెలియరానుంది. ఏదేమైనా ఆదిపురుష్ సినిమాపై క్రేజ్ మాములుగా లేదు.

Dattatreya Stotram: ఈ స్తోత్రాలు వింటే గ్రహదోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి