Bigg Boss 6: ఈ వారం హౌస్ నుంచి రివ్యూవర్ అవుట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 6: బిగ్ బాస్-6 తెలుగు సీజన్ చప్పగా సాగుతోంది. గతంలో ఉన్న పోటీ ప్రస్తుతం కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. హౌస్‌లో ఎవరూ సీరియస్‌గా ఆడటం లేదు. ఇప్పటికే గతవారం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ రద్దు కూడా చేశాడు. కనీసం నామినేషన్స్‌లో ఉంటే అయినా పోటీగా ఆడతారని భావిస్తూ ప్రతివారం ఎక్కువ మంది కంటెస్టెంట్లను బిగ్‌బాస్ నామినేషన్‌లో ఉంచుతున్నాడు. 8వ వారం ఏకంగా 13 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, రేవంత్, శ్రీహాన్, రాజ్, ఫైమా, శ్రీసత్య, సూర్య, వాసంతి, రోహిత్, మెరీనా, కీర్తి భట్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్ ట్రెండ్‌ను చూసుకుంటే రేవంత్‌కు అత్యధిక ఓట్లు పడుతున్నాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో శ్రీహాన్ ఉన్నాడు. 35 శాతం ఓట్లు వీళ్లిద్దరికే పడుతున్నాయి.
Read Also: Yash: బ్రహ్మాస్త్ర 2 లో యష్..?
Also Read
- Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్... ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
- Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
- Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ 'పార్వేట'
- Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
అటు ఓటింగ్‌లో మూడో స్థానంలో మెరీనా ఉండటం విశేషం. గతవారం చివరిస్థానంలో ఉన్న ఆమె ఈ వారం అనూహ్యంగా మూడో స్థానానికి దూసుకొచ్చింది. గీతూ నాలుగో స్థానానికి పరిమితమైంది. కీర్తి ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుస స్థానాల్లో ఫైమా, ఇనయా, వాసంతి, రోహిత్, శ్రీసత్య ఉన్నారు. అయితే వీళ్లందరి మధ్య పెద్దగా తేడా లేదు. దీంతో వీరి స్థానాలు మారుతూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే గత వారం వరకు టాప్-5లో ఉన్న సూర్య ఈ వారం అట్టడుగు స్థాయికి పడిపోయాడు. సూర్య, బాలాదిత్య, ఆదిరెడ్డి, రాజ్ ప్రస్తుతానికి డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే ఈ వారం రివ్యూవర్ ఆదిరెడ్డి హౌస్ నుంచి వెళ్లిపోతాడనే సంకేతాలు అందుతున్నాయి. అతడు పెద్దగా టాస్కులు ఆడుతుంది లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో కూడా ఆదిరెడ్డి వీక్‌గా కనిపిస్తున్నాడు. మరి వీకెండ్ కల్లా ఓట్ల విషయంలో తేడాలు వస్తే తప్ప ఆదిరెడ్డి ఈ వారం హౌస్ నుంచి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!