Adhurs Movie Re Releasing in wrong time: ఈ మధ్యకాలంలో ఎప్పుడో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న వ్యవహారం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ ఇలా ఒకరేమిటి చాలా మంది హీరోల సినిమాలను వారి పుట్టినరోజులు సందర్భంగా లేదా సినిమా విడుదలై 10 ఏళ్ళు, పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రీ రిలీజ్ వ్యవహారాలు దాదాపు అన్ని సినిమాలకు కలిసి రావడం లేదు. ఏదో కొన్ని సినిమాలు వరకు బాగానే వర్కౌట్ అవుతున్నాయి, ప్రింట్లు మార్చినందుకు ఖర్చయినా వెనక్కి వస్తున్నాయి. అయితే ఇప్పుడు వరుసగా రీ రిలీజ్ అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
Jabardasth Vinod: జబర్దస్త్ వినోద్ కు చేతబడి.. వామ్మో ఇలా అయ్యాడేంటి?
తాజాగా ఈ నెల 18వ తేదీన అదుర్స్ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు అదుర్స్ నిర్మాతలు. వాస్తవానికి ఇది కరెక్ట్ రిలీజ్ డేట్ కాదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే మంగళవారం, సప్త సాగరాలు దాటి సైడ్ బీ, స్పార్క్, అన్వేషి, ఉపేంద్ర గాడి అడ్డా లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మంగళవారంతో పాటు సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో పోటీ పడుతూ అదుర్స్ సినిమాని దింపడం ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తోంది. అది కూడా సరైన ప్లానింగ్ లేకుండా దింపినట్టుగానే కనిపిస్తోంది. సరైన ప్లానింగ్ చేసి అభిమానులందరినీ అలర్ట్ చేసి కనక రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.