సూపర్ స్టార్ మహేశ్ బాబు అనగానే ‘పోకిరి’, ‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’, ‘శ్రీమంతుడు’ లాంటి కమర్షియల్ సినిమాలు గుర్తొస్తాయి. బాక్సాఫీస్ ని షేక్ చేసిన కమర్షియల్ సినిమాలే కాదు మహేశ్ ప్రయోగాలని కూడా చాలానే చేశాడు కానీ ఆయన ఫాన్స్ వాటిని రిసీవ్ చేసుకోలేక పోయారు. అందుకే మహేశ్ ప్రయోగాలకి దూరంగా, హిట్స్ కి దగ్గరగా వచ్చి సినిమాలు చేస్తున్నాడు. అయితే ఒక వర్గం మహేశ్ ఫాన్స్ మాత్రం తమ హీరోని కొత్త రకం కథల్లో చూడాలి, కొత్త పాత్రలు పోషిస్తే చూడాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి మహేశ్ అభిమాని ఒకతను, అడవి శేష్ ని ట్యాగ్ చేసి “హిట్ సీరీస్ లోకి మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోని ఇన్వాల్వ్ చెయ్యండి అన్న. నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోతుంది, ఎప్పటినుంచో నీ వే ఆఫ్ థ్రిల్లింగ్ స్టోరీస్ లో మహేశ్ ని చూడాలని కోరిక… సస్పెన్స్ థ్రిల్లర్ రాసి, మహేశ్ అన్నతో చెయ్యండి” అంటూ ట్వీట్ చేశాడు.
మహేశ్ ఫాన్స్ అడిగిన ప్రశ్నకి అడవి శేష్ సమాధానం ఇస్తూ… “తెలియదు, సూట్ అవుతుందో లేదో ఆలోచించాలి. అయితే ఈరోజు ఉదయం మహేశ్ సర్ నాకు కాల్ చేసి చాలాసేపు మాట్లాడారు. నన్ను చూసి గర్వంగా ఉందని మహేశ్ సర్ చెప్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి. నేను ఎప్పటికీ ఒక తమ్ముడిలా మీ పక్కన ఉంటాను అని చెప్పాను. హిట్ 2 సినిమాని మహేశ్ సర్ ని చూపించాలి” అని రిప్లై ఇచ్చాడు. అడవి శేష్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృష్ణగారు చనిపోయిన తర్వాత మహేశ్ బయట ఎక్కువగా కనిపించలేదు. ఆయన త్రివిక్రమ్ తో చేస్తున్న #SSMB28 సినిమా లేటెస్ట్ షెడ్యూల్ డిసెంబర్ 8న మొదలయ్యే ఛాన్స్ ఉంది.