Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Adavi Sesh Birthday Special

అడివి శేష్ విలక్షణ ప్రయాణం!

Published Date :December 17, 2021 , 2:49 pm
By Roja Pantham
అడివి శేష్ విలక్షణ ప్రయాణం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

నవతరం కథానాయకుల్లో చాలామంది వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు. వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు అడివి శేష్. ఆరంభంలో చిన్న పాత్రల్లోనే అలరించిన అడివి శేష్, ఇప్పుడు హీరోగానూ, అడపా దడపా దర్శకునిగానూ మురిపిస్తున్నారు. కెమెరా ముందు నిలచినా, మెగాఫోన్ పట్టినా, వరైటీగా ఏదో ఒకటి చేయాలని తపిస్తున్నారు శేష్. అందుకు తగ్గట్టుగానే విలక్షణమైన పాత్రల్లో నటించి ఆకట్టుకుంటున్నారు.

అడివి శేష్ 1985 డిసెంబర్ 17న జన్మించారు. పుట్టింది తెలుగునేలమీదే అయినా పెరిగింది మాత్రం అమెరికాలోని బర్క్ లీలో. అక్కడే విద్యాభ్యాసం సాగించాడు శేష్. అతని సమీపబంధువు సాయికిరణ్ అడివి కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే సమయంలో అడివి శేష్ లోనూ నటనాభిలాష కలిగింది. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘మల్లెపువ్వు’ అనే సినిమాలో నటించడానికి వచ్చాడు శేష్. ఎందుకనో ఆ సినిమా ముందుకు సాగలేదు. శేష్ సినిమా రంగానికి పనికి రాడని అన్నారు. ఆ మాటతో అతనిలో పట్టుదల పెరిగింది. ఆ తపనతోనే సినిమా పరిజ్ఞానం, ఫిలిమ్ మేకింగ్ లో మెలకువలు, నటనలో శిక్షణ తీసుకున్నారు. ‘సొంతం’ వంటి కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లో కనిపించాడు శేష్. పవన్ కళ్యాణ్ ‘పంజా’లో గుర్తింపు ఉన్న పాత్రలో నటించాడు. తరువాత “బలుపు, కిస్, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్ మెన్”లో కనిపించాడు. ‘బాహుబలి- ద బిగినింగ్’లో ఓ కీలక పాత్రలో నటించి, మరింత గుర్తింపు సంపాదించాడు శేష్.

“క్షణం, ఊపిరి, అమీ తుమీ, గూఢచారి, ఓ బేబీ, ఎవరు” చిత్రాలలో కీ రోల్స్ లోనూ, హీరోగానూ కనిపించాడు శేష్. ‘గూఢచారి, ఎవరు’ చిత్రాలు శేష్‌ కు హీరోగా మంచి మార్కులు సంపాదించి పెట్టాయి. “కర్మ, కిస్” చిత్రాలకు దర్శకత్వం వహించాడు శేష్. వీటితో పాటు “క్షణం, గూఢచారి, మేజర్” సినిమాలకు కథలు కూడా అందించాడు. మహేశ్ బాబు నిర్మించిన ‘మేజర్’ చిత్రంలో హీరోగా నటించాడు శేష్. త్వరలోనే ఆ సినిమా జనం ముందుకు రానుంది. ఈ బర్త్ డే తరువాత అడివి శేష్ మరింతగా స్పీడు పెంచే అవకాశం ఉంది. ఏ యే సినిమాలతో శేష్ జనాన్ని ఆకట్టుకుంటారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adavi Sesh
  • birthday special
  • happy birthday
  • tollywood hero
  • tollywood movie

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions