Yamini Singh: చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయి. హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లను వేధిస్తూ వారిని హింసిస్తున్నారు. ఇక తాజాగా స్టార్ హీరో పవన్ సింగ్ సైతం హీరోయిన్ ను వేధించడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భోజ్ పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇండస్ట్రీలో అతను స్టార్ హీరో.. అలాంటి హీరోపై హీరోయిన్ యామిని సింగ్ ఘాటు ఆరోపణలు చేసింది. పవన్ తనను లైంగికంగా వేధించాడు అని చెప్పుకొచ్చింది. రాత్రికి వస్తావా అంటూ అసహ్యంగా మాట్లాడాడని చెప్పుకొచ్చింది. ఇక అసలు విషయానికొస్తే.. యామిని, పవన్ నటిస్తున్న కొత్త సినిమా బాస్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. కొన్ని రోజులు షూటింగ్ జరిగాకా ఆమెను సినిమా నుంచి తొలగించారు. అయితే ఆమె తీరు నచ్చకే ఆమెను తొలగించినట్లు మేకర్స్ తెలిపారు.
యామిని ఈ వ్యాఖ్యలను ఖండించింది. తనను, పవన్ లైంగిక వేధింపులకు గురిచేశాడని..తనను ఎవరు సినిమా నుంచి తీయలేదని, తానే సినిమా నుంచి బయటికి వచ్చేశానని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు పవన్ మంచి నటుడని అనుకున్నానని తెలిపిన యామిని.. ఈ సినిమా తరువాత అతని అసలు బండారం బయటపడిందని చెప్పుకొచ్చింది. ఒక రోజు పవన్ నైట్ ఫోన్ చేసి స్టూడియో కు రావాలని చెప్పాడని, నేను రాను చెప్తే.. సినిమాలో నటించాలని ఉందా..? లేదా..? ఉంటే రాత్రికి రావాలని వార్నింగ్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది. రాకపోతే మర్యాద గా ఉండదని కూడా బెదిరించాడని, ఆ తరువాత కాల్ కట్ చేసి తాను సినిమా నుంచి బయటికి వచ్చినట్లు తెలిపింది. ఇక ఈ ఆరోపణలపై పవన్ ఏ విధంగా స్పందిస్తాడో తెలియాలి. పవన్ పై ఇలాంటి ఆరోపణలు చాలానే ఉన్నాయి. అంతకు ముందు కూడా ఒక హీరోయిన్ అతడిపై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టింది.