సారా అలీ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్ అయినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఆమె ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో నటించలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చేరిపోయింది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సారా అద్భుతమైన నటనా నైపుణ్యం, ఆమె వెయిట్ లాస్ జర్నీ, ఎదురులేని అందం వంటి అంశాలు ఆమెకు ఎంతోమంది అభిమానులను చేరువ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఒకే ఒక్క కండిషన్ అంటోంది. సారా ప్రస్తుతం ధనుష్, అక్షయ్ కుమార్ లతో కలిసి “అత్రంగి రే” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పెళ్లి గురించి మనసులోని మాటను బయట పెట్టింది.
Read Also : “అడవి తల్లి మాట”… ‘భీమ్లా నాయక్’ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సాంగ్
సారా అలీఖాన్ కు కాబోయే భర్త తనను తన తల్లి నుంచి దూరం చేయొద్దని, ఆమెతో కలిసి జీవించడానికి ఒప్పుకోవాలని కోరింది. తన తల్లిని ఒంటరిగా వదలనని స్పష్టం చేసింది. సారా తన తల్లి అమృతా సింగ్‌కి చాలా సన్నిహితంగా ఉంటుంది. తల్లి, కూతురు కలిసి తరచుగా వెకేషన్ ను ఎంజాయ్ చేస్తారు.ఎప్పటికప్పుడు ఆ ఫోటోలను సారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
“అత్రంగి రే” చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సారా బీహారీ అమ్మాయిగా నటిస్తుంది. ధనుష్ విషు పాత్రలో కనిపించనున్నాడు. అయితే అక్షయ్ కుమార్ సారా లవర్ గా కనిపించబోతున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను భూషణ్ కుమార్ టి-సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.