బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై ఆమె భర్త సామ్ బాంబే దాడి చేయడంతో ఆసుపత్రి పాలైంది. దీంతో సామ్ అహ్మద్ బాంబే అరెస్ట్ అయ్యారు. అతనిపై పూనమ్ పాండే బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పూనమ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, సామ్ తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడడంతో గొడవ జరిగింది. దీంతో సామ్‌కి కోపం వచ్చింది. కోపంతో పూనమ్ పాండే జుట్టు పట్టుకుని తలను గోడకు కొట్టాడు. అంతేకాకుండా పూనమ్ ముఖంపై కొట్టాడు. ఈ దాడిలో పూనమ్ పాండే ఒక కన్ను, ఆమె ముఖంపై తీవ్ర గాయమైంది. పూనమ్ పాండే ఈ ఫిర్యాదు చేశాక బాంద్రా పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నారు. వెంటనే సామ్‌ను అరెస్టు చేశారు. బాంద్రా పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. కాగా ముంబై పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పూనమ్ పాండే ఆస్పత్రిలో చేరింది. అయితే పూనమ్ పాండే గాయానికి సంబంధించి ముంబై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
Read Also : విజయ్ సేతుపతిని తంతే నగదు బహుమతి… హిందుత్వ సంస్థ షాకింగ్ ప్రకటన !!
గతంలో కూడా పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబే తనపై దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. పూనమ్ పాండే, సామ్ అహ్మద్ బాంబే గతేడాది సెప్టెంబర్ 10న పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఇద్దరూ రెండేళ్లు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో గడిపారు. పెళ్లయిన 12 రోజులకే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. పూనమ్ పాండే గోవాలో సామ్ బాంబేపై కేసు పెట్టింది. సామ్‌ను అప్పట్లో గోవా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సామ్ బెయిల్‌పై విడుదలయ్యాడు.