సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా మారిన విషయం విదితమే. గత కొన్నిరోజుల నుంచి నరేష్ నాలుగో పెళ్లిపై వార్తలు గుప్పుమంటున్నాయి. సీనియర్ నటి పవిత్రా లోకేష్ ను నరేష్ నాలుగో పెళ్లి చేసుకొంటునట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలపై తాజాగా నరేష్ స్పందించాడు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాహం గురించి, వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతూ సీరియస్ అయ్యారు.
“జీవితం అసంపూర్తిగా ఉంటే పెళ్లి చేసుకొని వృధా.. ఒకప్పుడు నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీ కోర్టు ఒక్కటంటే ఒక్కటే ఉండేది.. కానీ ఇప్పుడు ఏడు, ఎనిమిది ఉన్నాయి. పడిలో ఏడుగురు.. పెళ్ళైన నాలుగు నెలలకే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. అస్సలు పెళ్లిళ్లు ఎందుకు సక్సెస్ కావడం లేదు. అప్పట్లో భర్త ఒక్కడే ఉద్యోగస్తుడు.. భార్య ఇంటికి యజమాని. పిల్లలను చూసుకోవడం, పెద్దవారి బాధ్యత అంతా ఆమెపైనే ఉండేది. కానీ, ఇప్పుడు ఎకనామికల్ బ్యాలెన్స్ మొదలయ్యింది. భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు.. వారికి వ్యక్తిగత సెల్ ఫోన్లు.. ఎవరి జీవితం వారిది. ఇక్కడే వివాహ వ్యవస్థ ఫెయిల్ అయ్యింది. పెళ్ళికి మీనింగ్ లేకుండా పోయింది.
ఇక నా గురించి చెప్పాలంటే ఆర్టిస్ట్ లైఫ్ చాలా ప్రత్యేకం.. ఒక సినిమా చేయడం కోసం నేను ఏది వదులుకోమన్నా వదులుకుంటా.. సినిమానే నా లైఫ్.. నా ఫ్యాషన్. నా గురించి, నా వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నవాడు, అర్ధం చేసుకున్నవారు నాతో ఉంటారు.. లేనివారు వెళ్ళిపోతారు. ఇటీవల నా నాలుగో పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.. ఏ సినిమా వాళ్లే విడిపోతున్నారా..? అలాంటివి బయట ఎక్కడా జరగడంలేదా..? మా గురించి అందరూ మాట్లాడుతున్నారు అంటే మేము సినిమా వాళ్ళం అనేగా.. అని సీరియస్ అయ్యారు. ప్రస్తుతంన నరేష్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.