Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటోంది. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తరచూ కనిపిస్తుండటంతో ఆమె గురించి రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆమె ప్రస్తుతం డేటింగ్ లో ఉందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఆమె నిర్మించిన శుభం మూవీ ప్రస్తుతం మంచి హిట్ టాక్ తో థియేటర్లలో ఆడుతోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సీనియర్ నటి మధుమణి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘నేను ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటించాను. ఎంతో మంది హీరోయిన్లకు తల్లి పాత్రల్లో నటించాను. కానీ సమంతతో నటించాలని ఎప్పటి నుంచో ఉన్నా అవకాశం రాలేదు.
Read Also : Tollywood: 300 + సినిమాలు ఫర్ సేల్
ఈ మూవీలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఆమెతో కలిసి స్క్రీన్ పంచుకున్నాను. ఎప్పటి నుంచో ఇలాంటి ఛాన్స్ కోసమే చూస్తున్నాను. ఈ సినిమాలో నా పాత్రను చూసి చాలా మంది నన్ను ప్రశంసించారు. సమంత, రాజ్ ఈ మూవీతో మళ్లీ జర్నీ స్టార్ట్ చేశారు. మీ జర్నీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ మధుమణి చెప్పారు.
ఆమె చేసిన కామెంట్స్ పై ఇప్పుడు మళ్లీ చర్చ జరుగుతోంది. వాళ్ల రిలేషన్ గురించి ఇలా కామెంట్ చేసిందా లేదంటే సినీ జర్నీ గురించా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమంత, రాజ్ రిలేషన్ పై ఎన్ని రూమర్లు వస్తున్నా వారు మాత్రం అస్సలు స్పందించట్లేదు. సమంత మేనేజర్ స్పందించాడంటూ కొన్ని వార్తలు వచ్చినా వాటిపై క్లారిటీ రావట్లేదు. మరి సమంత సైలెంట్ గా ఉంటుందా లేదా స్పందిస్తుందా అనేది చూడాలి.
Read Also : Vijay Devarakonda : రష్మికతో పెళ్లిపై స్పందించిన విజయ్.. ఏమన్నాడంటే..?