Maanya Anand: కమిట్మెంట్ ఇవ్వమని వెంటపడ్డాడు.. హీరో ధనుష్ మేనేజర్‌పై నటి షాకింగ్ కామెంట్స్!
- మరోసారి వార్తల్లో హీరో 'ధనుష్' పేరు
- ధనుశ్ మేనేజర్ శ్రేయాస్‌పై నటి షాకింగ్ కామెంట్స్
- కమిట్మెంట్ ఇవ్వమని వెంటపడ్డాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ‘ధనుష్’ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి అతని సొంత కారణాల వల్ల కాకుండా.. మేనేజర్ వల్ల సోషల్ మీడియాలో నిలిచారు. ధనుశ్ మేనేజర్ శ్రేయాస్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమిళ టీవీ నటి మాన్య ఆనంద్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. శ్రేయాస్ ఓ కొత్త సినిమా గురించి తనను సంప్రదించారని, కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారని చెప్పారు. శ్రేయాస్ పదే పదే తనను సంప్రదించేవాడని, తాను సినిమా తిరస్కరించినప్పటికీ స్క్రిప్ట్‌లు పంపేవాడని మాన్య తెలిపారు. మాన్య ఆరోపణలు అభిమానులను షాక్‌కు గురి చేశాయి.
‘హీరో ధనుశ్ మేనేజర్ శ్రేయాస్ ఓ కొత్త సినిమా కోసం నన్ను సంప్రదించారు. సినిమా కోసం కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పారు. ఎలాంటి కమిట్మెంట్?, నేను ఎందుకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ప్రశ్నించా. సినిమా కోసం షరతులు అంగీకరించడానికి నేను సిద్ధంగా లేనని చెప్పా. ధనుష్ సర్ అయినా మీరు అంగీకరించరా? అని అన్నాడు. శ్రేయాస్ నాకు చాలాసార్లు ఫోన్ చేసి ధనుష్ నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్స్ లొకేషన్ పంపాడు. నేను తిరస్కరించినప్పటికీ స్క్రిప్ట్ పంపాడు. స్క్రిప్ట్ చదివారా? అని అడిగేవారు. నేను స్క్రిప్ట్ చదవలేదు, ఈ సినిమా చేయడం లేదని చెప్పా. మేము నటులం, నటించడం మా పని. మాకు అవకాశాలు ఇవ్వండి కానీ.. ప్రతిఫలంగా ఏమీ ఆశించకండి. సినీ ఇండస్ట్రీలో ఈ పద్ధతికి ముగింపు పలకాలని నేను కోరుకుంటున్నా’ అని మాన్య ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Suriya: 'హోంబాలే'తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్‌బ్యాక్ దక్కిందా?
- RaviTeja : మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
Also Read: Chadalavada Srinivasa Rao: అందుకే.. ప్రేక్షకుడు దొంగ దారిలో సినిమా చూస్తున్నాడు!
అదే సినిమా కోసం మరో మేనేజర్ కూడా ఇలాంటి డిమాండ్లతోనే తనను సంప్రదించారని మాన్య ఆనంద్ చెప్పారు. ఆయనకు కూడా తాను నో చెప్పానని కెరీర్లో ఎదురైన క్యౌస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకున్నారు. 30 ఏళ్ల మాన్య తమిళ టీవీ సీరియల్ వనతై పోలా ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. మాన్య ఇంటర్వ్యూ వైరల్ అవుతున్నప్పటికీ.. అటు శ్రేయాస్ కానీ, ఇటు ధనుష్ టీమ్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
తాజావార్తలు
-
Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
-
Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు!
-
Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
-
ENE Repeat: ఈ నగరానికి ఏమైంది Repeat.. దుమ్మురేపెందుకు మళ్ళీ రెడీ
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!