Kriti Kharbanda: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ లో మెరిసిన బ్యూటీ కృతి కర్బందా. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా అమ్మడికి మాత్రం మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. కానీ, ఏం ప్రయోజనం.. వరుస అవకాశాలు కానీ,హిట్లు కానీ అందుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పి బాలీవుడ్ లోనే ఒక మోస్తారు హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక గత కొంతకాలంగా ఈ చిన్నది ఒక వ్యక్తి ప్రేమలో మునిగి తేలుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అతడే హీరో పులకిత్ సామ్రాట్. సీరియల్, చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. వీరిద్దరూ గత కొంతకాలముగా ప్రేమలో ఉన్నారట. ఇవన్నీ పుకార్లు అని అనుకుంటున్న అభిమానులకు కృతి కుండా బద్దలు కొట్టేసింది. తాను, పులకిత్ ప్రేమలో ఉన్నట్లు వాలెంటెన్స్ డే సందర్భంగా చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం.
Meena- Sanghavi: ‘సూర్యవంశం’ హీరోయిన్లు ఇప్పటికీ ఇరగదీస్తున్నారే
హలో వాలెంటైన్ అంటూ అతడితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది కృతి. దీంతో వీరి ప్రేమ బహిరంగంగా మారింది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. పులకిత్ కు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. అతను గతంలో శ్వేతా రోహిరా అనే హీరోయిన్ ను పెళ్ళాడి.. ఏడాదికే విడాకులు ఇచ్చి సింగిల్ గా ఉంటున్నాడు. దీంతో అభిమానులు కృతిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు కూడా సెకండ్ హ్యాండ్ వాడితోనే సెటిల్ అయ్యావా..? అని కొందరు. అతడి భార్యఏడాదికే వదిలేసింది అంటే.. ఒకసారి ఆలోచించు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక బాలీవుడ్ అనే కాకుండా ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్ సెకండ్ హ్యాండ్ వారితోనే ప్రేమలో పడుతున్నారు. మొన్నటికి మొన్న హన్సిక తన ఫ్రెండ్ భర్తతోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కృతి కూడా అదే తరహాలో పెళ్ళైన వాడిని వివాహమాడనుంది. మరి వీరి వివాహం ఎప్పుడు జరగనుందో చూడాలి.