Kovai Sarala Birthday: కోట్ల నవ్వులు పూయించిన కోవై సరళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవై సరళ మాతృభాష మలయాళం. పుట్టిందేమో తమిళనాడు. చెలరేగింది తెలుగునాట. సరళ అభినయంలో అతి కనిపించినా, అది ఎందుకనో ‘అతికి’నట్టుగానే ఉంటుంది. అందుకే కోవై వినోదం చూసి జనం జేజేలు పలికారు. తెలుగును సైతం తనదైన పంథాలో పలికి, పసందైన పాత్రల్లో నవ్వులు పూయించారామె. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు కోవై సరళ.
కోవై సరళ 1962 ఏప్రిల్ 7న కోయంబత్తూరులో జన్మించారు. చదువుకునే రోజుల నుంచీ సరళ ఎంతో చిలిపిగా ఉండేవారు. ఇతరులను ఇట్టే ఆట పట్టించేవారు. అయితే అందరితోనూ కలసి పోవడం ఆమె నైజం. చిన్నప్పుడు యమ్.జి.ఆర్. సినిమాలు విపరీతంగా చూసి ఆనందించేవారు సరళ. ఆయన సినిమాల్లోని పాటలను సైతం భట్టీయం వేసి పాడుకుంటూ సాగేవారు సరళ. అలా సినిమాలపై సరళకు ఆసక్తి కలిగింది. సరళ తొమ్మిదో తరగతి చదివే రోజుల్లో విజయకుమార్, కె.ఆర్.విజయ జంటగా నటించిన ‘వెల్లి రదం’ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. భాగ్యరాజా నటించి, తెరకెక్కించిన ‘ముందానై ముడిచ్చు’లో 32 ఏళ్ళ గర్భవతి పాత్రలో నటించారామె. అప్పుడు సరళ పదో తరగతి చదువుతున్నారు. తరువాత రెండేళ్ళకు అదే భాగ్యరాజాకు ‘చిన్నవీడు’ సినిమాలో 65 ఏళ్ళ తల్లి పాత్రలోనూ కోవై సరళ నటించి అబ్బుర పరిచారు. ఇలా చిన్నా చితకా పాత్రలు పోషిస్తున్న సరళకు కమల్ హాసన్ నిర్మించి, నటించిన ‘సతీ లీలావతి’లో ఏకంగా ఆయనకు భార్యగా నటించే అవకాశం దక్కింది. అందులో కోవై సరళ, కమల్ హాసన్‌తో పోటీ పడి కామెడీ పండించాన్ని ఎవరూ మరచిపోలేరు. ఆ సినిమా విజయంతో కోవై సరళ తమిళనాట బిజీ కమెడియన్ అయిపోయారు.
Also Read
- Veeradhi Veerulu: మాస్ మహారాజా - శ్రీవిష్ణు కాంబో మిస్ అయినట్లేనా? ‘వీరాధి వీరులు’పై పిన్ డ్రాప్ సైలెన్స్!
- Keerthy Suresh: స్పెషల్ సాంగ్ నుంచి స్టార్ హీరోల దాకా.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మామూలుగా లేదుగా!
- Box Office Crisis: శుక్రవారం వస్తున్నాయి.. ఆదివారమే వెళ్లిపోతున్నాయి! చిన్న సినిమాలకు అసలేమైంది?
- AOT Trailer: పది మంది నవ్వితే ఏంటి, ఒక్కరు నమ్మితే చాలదా.. హృదయానికి హత్తుకునేలా ఏవోటీ ట్రైలర్!
తెలుగులో కోవై సరళ తొలి చిత్రం బి.విఠలాచార్య దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా రూపొందిన ‘వీరప్రతాప్’. తరువాత ‘అమ్మ కడుపు చల్లగా, పెళ్ళాం చెబితే వినాలి, పెళ్లామా మజాకా, కుంతీ పుత్రుడు, భైరవద్వీపం, అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి, పెళ్ళి’ వంటి చిత్రాలలో తనకు లభించిన పాత్రలకు న్యాయం చేశారు. ‘నువ్వే కావాలి’లో కోవై సరళ పండించిన కామెడీ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత తెలుగునాట మరింత బిజీ అయిపోయారామె. ముఖ్యంగా బ్రహ్మానందం కాంబినేషన్లో కోవై సరళ నటించిన అనేక చిత్రాలు జనానికి కితకితలు పెట్టాయి. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో ప్రవేశించి, వినోదం పంచడానికి సిద్ధంగా ఉన్నారామె. తన బంధువుల పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కోసం కోవై సరళ వివాహం చేసుకోలేదు. ఆ పిల్లలనే కన్నబిడ్డల్లా పెంచుకున్నారామె. తన అభిమాన హీరో ఎమ్జీఆర్ స్ఫూర్తితో కోవై సరళ రాజకీయాలపైనా ఆసక్తి పెంచుకున్నారు. తనకు గుర్తింపు సంపాదించి పెట్టిన కమల్ హాసన్ నెలకొల్పిన ‘మక్కల్ నీది మయం’ పార్టీ సభ్యురాలుగా ఆ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారామె.
(ఏప్రిల్ 7న కోవై సరళ పుట్టినరోజు)
తాజావార్తలు
-
No Flying Zone: విజయవాడలో అమిత్ షా పర్యటన.. కీలక ప్రాంతాల్లో ‘నో ఫ్లైయింగ్ జోన్’ అమలు..
-
Rajat Patidar: 48 బంతుల్లో 135 పరుగులు.. ఆర్సీబీ కెప్టెన్ వీరవిహారం..
-
Veeradhi Veerulu: మాస్ మహారాజా – శ్రీవిష్ణు కాంబో మిస్ అయినట్లేనా? ‘వీరాధి వీరులు’పై పిన్ డ్రాప్ సైలెన్స్!
-
Keerthy Suresh: స్పెషల్ సాంగ్ నుంచి స్టార్ హీరోల దాకా.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మామూలుగా లేదుగా!
-
Giacomo Filibeck: కాంగ్రెస్‌కు మద్దతుగా ‘ఓట్ చోర్’ నినాదాలు.. ఇటలీ నేతను బ్లాక్‌లిస్ట్ చేసిన ఫిలిప్పీన్స్!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!