Gismat Jail Mandi: గతంలో తెలుగు సినిమాలో నటించినా… మలయాళ భామ హనీ రోజుకు బ్రేక్ ఇచ్చింది మాత్రం ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ చిత్రమే. బాలకృష్ణకు జోడీగా హనీరోజ్ పోషించిన మీనాక్షి పాత్రతో ఒక్కసారిగా ఆమెకు క్రేజ్ వచ్చేసింది. దాంతో ఇప్పుడు రెస్టారెంట్స్ ఓపెనింగ్స్ కు కూడా హనీరోజ్ కు ఆహ్వానాలు అందుతున్నాయి. అందులో భాగంగా హనీరోజ్ హైదరాబాద్ మదీనగూడలోని శ్రీ దుర్గా కాలనీ మెయిన్ రోడ్ లోని ఏకెయం ధర్మరావు సిగ్నెచర్ లో ఏర్పాటైన ‘జిస్మత్ జైల్ మండి అండ్ థీమ్ రెస్టారెంట్’ ప్రారంభించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందని, భోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు, జైల్ మరియు నవాబ్ థీమ్ ఇక్కడ ఎంతో విభిన్నంగా ఉంద’ని అన్నారు. జిస్మత్ మండి నిర్వాహకులు, ప్రముఖ యూట్యూబర్ గౌతమి మాట్లాడుతూ ఈ మండిలో జైల్ అండ్ నవాబ్ డిజైన్ థీమ్ ప్రత్యేకమని, ఖైదీల వేషదారణలో కారాగారం డైనింగ్ లో కూర్చునే ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారన్నారు. విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరులో బ్రాంచీలు కలిగిన తమ జిస్మత్ మండి త్వరలో సన్ సిటీలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రాంఛైజీ నిర్వహకులు దినేష్ మాట్లాడతూ ‘తమ మండి రెస్టారెంట్ లో ఛెఫ్ లు ప్రత్యేకమైన జూసి మటన్ మండి, అల్ఫాహం మండి, అరబిక్ ఫిష్ వంటి అనేక రకాల వంటకాలను అందిస్తున్నార’ని వివరించారు. టాలీవుడ్ నటుడు ధర్మా, శ్రీని ఇన్ ఫ్రా యం.డి. శ్రీను తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.