Hema : నటి హేమ సంచలన కామెంట్లు చేసింది. గతేడాది తనకు ఎవరినైనా చంపేయాలి అనిపించేదని చెప్పి సంచలనం రేపింది. వందలాది సినిమాల్లో నటించిన హేమ.. ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను కరోనా టైమ్ నుంచే కొంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. అప్పుడు ఎక్కడికీ వెళ్లకపోవడంతో ఎంజాయ్ మెంట్ మిస్ అయ్యాను. ఒకే దగ్గర ఉండటం వల్ల డిప్రెషన్ గా అనిపించేది. ఇక గతేడాది నేను ఎలాంటి తప్పు చేయకపోయినా.. నాపై నిందలు వేశారు. అవి చూసి చాలా బాధేసింది.
Read Also : Dammu Srija : నా కూతురు గంజి తాగి బతికింది.. శ్రీజ తండ్రి కామెంట్స్
అప్పుడు డిప్రెషన్ మరింత ఎక్కువైంది. ఆ టైమ్ లో ఎవరినైనా చంపేయాలి అనిపించేది.. లేదంటే చనిపోవాలి అనిపించేది. కానీ తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా. నా తప్పులేదని ప్రూవ్ చేయాలని అనుకున్నా. ఏ సమస్యకు అయినా పరిష్కారం ఆవేశం కాదు.. మన ఓపిక అని అర్థం చేసుకున్నా. అందుకే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది హేమ. గతేడాది ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆమె అరెస్ట్ అయింది. ఆ విషయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.
Read Also : Prabhas : ఆ విషయంలో ప్రభాస్ అందరికంటే తోపే..
