Vishal-Abhinaya: విశాల్‌తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన అభినయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Abhinaya Gives Clarity On Vishal Affair Rumours: నటీనటులు కాస్త సన్నిహితంగా మెలిగితే చాలు.. ఆ ఇద్దరి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే వార్తలు పుట్టుకొచ్చేస్తాయి. అటువైపు వాళ్లు ధృవీకరించకముందే.. సదరు జంట పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోందంటూ కథనాలు రాసేస్తారు. లేటెస్ట్‌గా హీరో విశాల్‌పై కూడా అలాంటి రూమరే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నటి అభినయతో అతను ప్రేమలో ఉన్నాడని, త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని ప్రచారం జరిగింది. ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటిస్తున్నారని, ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇప్పుడది పెళ్లిదాకా వెళ్తుందని వార్తలు వచ్చాయి.
ఈ గాసిప్పులపై విశాల్ ఇంతవరకూ స్పందించలేదు కానీ, నటి అభినయ మాత్రం ఆ వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. తమ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని, మార్క్ ఆంటోనీ సినిమాలో ఆయనకు భార్యగా మాత్రమే తాను నటిస్తున్నానని స్పష్టం చేసింది. రీల్ లైఫ్‌లో భార్యగా నటించినంత మాత్రానా.. రియల్ లైఫ్‌లో భార్య కాగలమా? అని ఆమె తిరిగి ప్రశ్నించింది. ఈ వివరణతో విశాల్, అభినయ మధ్య ప్రేమ ఉందనే రూమర్‌కి ఫుల్‌స్టాప్ పడినట్టయ్యింది. కాగా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన విశాల్‌పై ఇటువంటి రూమర్స్ రావడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకుముందు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీతో విశాల్ ప్రేమాయణం కొనసాగించాడంటూ తెగ ప్రచారం జరిగింది. వాళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా అప్పట్లో జోరుగా వినిపించాయి. తమ మధ్య ప్రేమ లేదని, కేవలం స్నేహితులం మాత్రమేనని ఎన్నిసార్లు స్పందించినా.. రూమర్లు మాత్రం ఆగలేదు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
అయితే.. ఇంతలో విశాల్ హైదరాబాద్‌కు చెందిన అనిషాతో నిశ్చితార్థం చేసుకొని షాకిచ్చాడు. కానీ.. పెళ్లి మాత్రం రద్దయ్యింది. ఇందుకు కారణం ఏంటో తెలీదు కానీ, నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత వాళ్లు తమ పెళ్లిని రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం విశాల్ కేవలం సినిమాల మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు. ప్రేమ, పెళ్లి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!