Sangeetha: పెళ్లికి ముందు తండ్రి మృతి.. నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. నటి ఆవేదన!
- పెళ్లికి ముందు తండ్రి మృతి
- అలాంటి పరిస్థితుల్లోనే పెళ్లి చేసుకున్నా
- పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది నా గురించి చెడుగా మాట్లాడేవారు
- డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని అంటున్నారన్న నటి సంగీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Redin Kingsley Wife Sangeetha Emotional Comments: తమిళ చిత్రసీమలో ఎన్నో ఏళ్లుగా ప్రయాణిస్తున్నా, ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2018లో విడుదలైన నయనతార నటించిన “కొలమావు కోకిల” సినిమాతో నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ రెడిన్ కింగ్స్లీ. రెడిన్ కింగ్స్లీ పలు మంచి చిత్రాల్లో నటిస్తూ తమిళ సినీ ప్రపంచంలో ప్రముఖ హాస్యనటుడిగా వెలుగొందుతున్నారు. 10 డిసెంబర్ 2023న, అతను ప్రముఖ టెలివిజన్, వెండితెర నటి సంగీతను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగినప్పుడు నటుడు రెడిన్ కింగ్స్లీకి 45 సంవత్సరాలు. నటి సంగీత విషయానికొస్తే, ఆమె దళపతి విజయ్ యొక్క మాస్టర్‌తో సహా అనేక మంచి చిత్రాలలో చిన్న పాత్రలలో నటించింది.
Pavitra Gowda: పవిత్ర గౌడకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటిల్ కి తరలింపు!
Also Read
రెడిన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కొన్న ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించింది. నటి సంగీత మాట్లాడుతూ ‘‘పెళ్లికి ఒకరోజు ముందు నేనూ, మా అమ్మ బయటకు వెళ్తున్నాం.. అప్పుడు మా నాన్నకు ఛాతీ నొప్పి వచ్చింది.. కానీ మమ్మల్ని భయపెట్టకూడదని చెప్పలేదు. “చేతిలో వాటర్ బాటిల్ తీసుకుని డోర్ దగ్గరకు వచ్చి మమ్మల్ని పంపించాడు. కానీ దురదృష్టవశాత్తూ మేం ప్రయాణిస్తున్న కారులో ఏదో సమస్య వచ్చి మళ్లీ ఇంటికి వచ్చేశాం. కాసేపటి తర్వాత మరో కారులో బయల్దేరి వెళ్లాం.
అప్పుడు కూడా మాతో ఏమీ అనలేదు. “అలాంటి సమయంలోనే ఛాతిలో నొప్పి వచ్చి చనిపోయాడు.. ఈరోజు వరకు తన నష్టాన్ని పూడ్చుకోలేక పోయాను.. ఆయన మా పెళ్లికి లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది.. అలాంటి పరిస్థితుల్లోనే పెళ్లి చేసుకున్నాను. కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది నా గురించి చెడుగా మాట్లాడేవారు. నాకు ఇదివరకే పెళ్లయిందని, నాకు కూతురు ఉందంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆమె నా తమ్ముడి కూతురేనని చెప్పినా, నేటికీ చాలా మంది నా గురించి చెడుగా మాట్లాడుతున్నారని, డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని అంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!