Actor Raja Sridhar enters into Real Estate with Sridhar Properties: సినిమాలు, సీరియళ్లతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన రాజా శ్రీధర్ సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్. ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’తో పాటు పలు సినిమాలు చేసిన శ్రీధర్ ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. మూవీ, టీవీ ఆర్టిస్టులకి సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు, అందుకే రాజా శ్రీధర్ ప్రొఫెషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నెటిజన్లకి నిత్యం టచ్‌లో ఉంటున్నారు. రీసెంట్గా శ్రీధర్, శ్రీధర్ ప్రాపర్టీస్ అనే సంస్థ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంటర్ అయ్యారు. తనకు మంచి స్నేహితుడు అయిన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ రోజు శ్రీధర్ ప్రాపర్టీస్ బ్రోచర్ అండ్ వెబ్సైట్ లాంచ్ చేశారు.
Umapathy Ramaiah: స్టార్ హీరో కుతూర్ని లవ్‌లో పడేసి ఏకంగా హీరో అయిపోయిన కమెడియన్ కొడుకు
ఇక అలా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లోకి రాజా శ్రీధర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తనకు అత్యంత ఆప్తుడే కాదు, ఇండియాస్ మోస్ట్ ఫేవరేట్ హీరో అయిన ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం తన అదృష్టం అని ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. శ్రీధర్ ప్రాపర్టీస్ ద్వారా రియల్ ఎస్టేట్ సంస్థలకు వీడియో మార్కెటింగ్ సర్వీసెస్ లు అందించడమే కాకుండా అన్ని రకాల ప్రాపర్టీస్ నూ అన్ని వర్గాల వారికి అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇక సంస్థ కార్యకలాపాలు, వివరాల కోసం శ్రీధర్ ప్రాపర్టీస్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ వెల్లడించారు.