Relative of Actor Mathew Thomas dies in accident: ప్రేమలు సినిమాలో థామస్ అనే పాత్రతో తెలుగు వారికి కూడా దగ్గరైన యువ నటుడు మాథ్యూ థామస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మాథ్యూ థామస్ కుటుంబం ప్రయాణిస్తున్న జీపు బోల్తా పడి దగ్గరి బంధువు ఒకరు మృతి చెందారు. మామల తురుత్తికి చెందిన రిటైర్డ్ టీచర్ బీనా డేనియల్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. బీనా వయసు 61 సంవత్సరాలు. బీనాను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు.
GV Prakash Kumar: విడాకులపై దారుణ ట్రోల్స్.. కీలక ప్రకటన చేసిన జీవీ ప్రకాష్
ఇక తిరువనంతపురంలో మాథ్యూ తండ్రి బిజు, తల్లి సుసాన్, మృతుడు బీనా భర్త సాజు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. బుధవారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని అంటున్నారు. వారు తమ బంధువు మరణానంతర కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో తిరువనంతపురంలోని షష్టమ్స్‌లో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై జీపు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో మాథ్యూ సోదరుడు జాన్ వాహనం నడుపుతున్నా అతనికి తీవ్రంగా గాయాలు కాలేదు. బీనా భర్త సాజు, మాథ్యూ తల్లిదండ్రులు బిజు, సుసన్‌లకు కూడా గాయాలయ్యాయి. వారిని ఎర్నాకులం మెడికల్ ట్రస్ట్ ఆసుపత్రిలో చేర్చారు.