Dhruva Sarja: పండగ రోజే తండ్రైన స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Dhruva Sarja And Wife Prerana Shankar Blessed with a Baby Boy on Vinayaka Chavithi: కన్నడ స్టార్ హీరో అర్జున్ సర్జా మేనల్లుడు కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా రెండోసారి తండ్రయ్యాడు. ధ్రువ భార్య ప్రేరణ సోమవారం నాడు అంటే వినాయక చవితి రోజునే ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2019 లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ముందుగా 2022 అక్టోబర్‌లో ఓ ఆడపిల్ల జన్మించారు. ఇక ధ్రువ భార్య రెండవ సారి తల్లి కాగా ఇప్పుడు మగబిడ్డ జన్మించడంతో ధ్రువ సర్జా కుటుంబంలో సంతోషం నెలకొంది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రేరణ ప్రసవం జరిగిందని, ఇప్పుడు తాను రెండో సారి తండ్రైన విషయాన్ని ధ్రువ సర్జానే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘సాధారణ ప్రసవం జరిగింది. బేబీ పుట్టింది’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సర్జా వెల్లడించారు. ఇక ఈ క్రమ్మలో కన్నడ సినీ ప్రముఖులు, నెటిజన్లు సర్జా కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Naga Suseela: హీరో సుశాంత్, తల్లిపై పోలీసు కేసు.. అసలు ఏమైందంటే?
Also Read
నిజానికి ఈమధ్యనే ప్రేరణ సీమంతం వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు ధ్రువ సర్జా. దివంగతుడైన తన అన్న చిరంజీవి సర్జా సమాధి దగ్గర భార్య సీమంతం నిర్వహించి అన్నమీద ప్రేమను వ్యక్త పరిచారు. చిరంజీవి సర్జా తమ్ముడు ధ్రువ సర్జా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందుకంటే కన్నడలో తెరకెక్కిన ఒక సినిమాను తెలుగులో పొగరు అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కాకపోయినా ధ్రువకు మంచి పేరు తీసుకొచ్చింది. ముందు నుంచే ధ్రువకు అన్న చిరంజీవి సర్జా అంటే చాలా ప్రేమ. అన్న బాటలోనే హీరో అయి నిలదొక్కుకున్న ధృవ అన్న అంటే చాలా ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!