Actor Brahmaji to act as Lead in Baby 2: బేబీ అనే సినిమాని చిన్న బడ్జెట్ తో తీసి హిట్ కొట్టాడు డైరెక్టర్ సాయి రాజేష్. గతంలో హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ గా విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించిన ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. వాస్తవానికి ఈ సినిమా మీద విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతానికి సినిమా యూనిట్ అంతా ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. ప్రస్తుతానికి విజయ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఇదిలా ఉండగా బేబీ 2 సినిమాలో బ్రహ్మాజీ లీడ్ యాక్టర్ గా నటిస్తున్నాడు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
SKN: జర్నలిస్టులపై బేబీ నిర్మాత ఏస్కేన్ దౌర్జన్యం.. అసలు విషయం ఏంటంటే?
అయితే అసలు విషయం ఏమిటంటే ఒక నెటిజన్ బ్రహ్మాజీని ట్విట్టర్లో టాగ్ చేస్తూ బేబీ లాంటి సినిమాని మీరు లీడ్ యాక్టర్ గా ఎందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తే దానికి రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టిన బ్రహ్మాజీ డైరెక్టర్ సాయి రాజేష్ ను టాగ్ చేశారు. వెంటనే సాయి రాజేష్ బ్రహ్మాజీ ట్వీట్ కి రిప్లై ఇస్తూ బేబీ 2 సినిమా చేసేద్దామా అన్న అంటూ కామెంట్ పెట్టారు. ఇక దానికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బేబీ 2 సినిమాలో వైష్ణవి మోసం చేసినట్లుగా కాకుండా ఇక్కడ బ్రహ్మాజీ ఒక ఇద్దరు పాపలను మోసం చేస్తాడేమో అని కామెంట్ పెట్టారు. మరొక నెటిజన్ బ్రహ్మాజీ అన్న మీకు విరాజ్ క్యారెక్టర్ బాగా సెట్ అవుద్దేమో అని మరో కామెంట్ పెట్టారు.
💥🔥🕺😳🤣 @sairazesh https://t.co/qfiGAAeLlM
— Brahmaji (@actorbrahmaji) August 4, 2023