Acharya: మెగాస్టార్ ను వదిలేసి రియల్ స్టార్ కు పాలాభిషేకం చేసిన ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభిమానం.. అనేది ఎవరు ఆపలేనిది. ఒక నటుడును అభిమానులు అభిమానిస్తున్నారంటే గుండెల్లో పెట్టుకుంటారు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే వారికి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఆచార్య సినిమా రిలీజ్ అయిన విషయం విదితమే.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. నిన్న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. అయినా అభిమానానికి హిట్, ప్లాప్ అనేది అవసరం లేదు.. ఇక థియటర్ల వద్ద కటౌట్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు.. అబ్బో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో అభిమానులు రచ్చ రచ్చ చేశారు.
ఆహా మెగా అభిమానులు ఎంత అభిమానం చూపిస్తున్నారో కదా అనుకుంటున్నారేమో .. అక్కడ పాలాభిషేకం చేసింది చిరు కు కాదు, చరణ్ కి కాదు. ఆచార్య లో విలన్ గా నటించిన రియల్ హీరో సోనుసూద్ కు.. కరోనా సమయంలో సోనూ చేసిన పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సొంత ఖర్చులతో ఎంతోమంది వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేర్చారు. కష్టంలో ఉన్నవారికి కాదనకుండా హెల్ప్ చేసి కలియుగ దేవుడిగా మారిన సోనూసూద్ పై అభిమానులు తమ అభిమానం చాటుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో సోనూ కటౌట్ ని పెట్టి, పూలాభిషేకం చేయడంతో పాటు పాలాభిషేకం కూడా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటివరకు మెగాస్టార్ సినిమాలకు థియేటర్ వద్ద ఆయనకు పాలాభిషేకాలు చేయడం చూశాం కానీ మొట్టమొదటిసారి విలన్ గా నటించిన వ్యక్తికీ ఇలా పాలాభిషేకం చేయడం చూస్తున్నాం అని, రియల్ హీరోకు ఇలాంటివి ఎన్ని చేసినా తక్కువే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
The #SonuSood Phenomenon continues as the fans pour their love on the real hero once again! Such feat is rarely achieved by few super stars! @SonuSoodpic.twitter.com/RvRcwa6b37
— ᴊᴀɢᴀᴅɪꜱʜ (@jagadishsayz) April 30, 2022
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!