సోషల్ మీడియా వచ్చాక జనాల్లో, సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సెలబ్రిటీ కపుల్స్ పోస్టులు పెడితే వారు కలిసి ఉన్నట్లు.. జంటగా కాకుండా ఒక్కరే కనిపించిన, కొన్నిరోజులు సోషల్ మీడియాలో కనిపించకపోయినా వారు విడిపోయినట్లు పుకార్లు మొదలెడుతున్నారు. అంతేకాదు కుటుంబంలో ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీలు ఉంటే.. ఒకరి పోస్ట్ కు ఒకరు రియాక్ట్ అవ్వకపోయినా.. వారి సినిమాను సపోర్ట్ చేయకపోయినా వారి మధ్య విభేదాలు ఉన్నాయని డిసైడ్ చేసేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. అందుకే చాలామంది సెలబ్రిటీలు తాము కలిసి ఉన్నామని చెప్పడానికి మాత్రమే సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ బాబు మరదలు కూడా అదే చేసింది..
Also Read: Omkar : ‘డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్’ షో మొదలు పెట్టిన ఓంకార్..
నమ్రత చెల్లి శిల్పా శిరోద్కర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె కూడా నటినే. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె.. గతేడాది హిందీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్లి మరోసారి హైలెట్ అయ్యింది. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన ఎలిమినేట్ అయ్యింది. ఇక బయటకు వచ్చిన తర్వాత అక్క నమ్రతను కలిసి సెలబ్రేషన్ చేసుకుంది శిల్పా. ఇందులకు సంబంధించిన ఫోటోలు నమ్రత షేర్ చేస్తూ.. ఆమె తిరిగి రావడం చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది. కానీ మహేష్ దీనిపై ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. దీంతో మహేష్ కి షిల్పా కి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి అని మాటలు మొదలయ్యాయి. దీంతో ఇటివల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శిల్ప ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టింది..
Also Read:Aamir Khan: పెళ్లికొడుకు కాబోతున్న బాలీవుడ్ హీరో..
శిల్ప మాట్లాడుతూ.. ‘ ఈ మధ్య పోస్ట్ పెడితే మంచి సంబంధాలు ఉన్నాయని.. లేకపోతే ఏవో వివాదాలు ఉన్నాయి అనుకోవడం కామన్ అయిపోయింది. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మనుషుల మధ్య అనుబంధాన్ని సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా చేసుకుని అంచనా వేయకూడదు. ఆన్‌లైన్ వేదికగా ప్రేమాభిమానాలను వ్యక్తం చేసుకునే వ్యక్తులం కాదు మేము. మాకు అలాంటి అలవాటు లేదు. నన్ను నేను నిరూపించుకోవడానికి ఆ కార్యక్రమానికి వెళ్లాను. అంతేకానీ, నమ్రత చెల్లి గానో లేదా మహేష్ బాబుకు మరదలిగానో కాదు. మహేష్ బాబు సూపర్ స్టార్.. అయినంత మాత్రాన నా కెరీర్ లో భాగం కావాలని రూల్ లేదు. మహేశ్, నమ్రతలు ప్రైవేట్ వ్యక్తులు. ఇతరులతో త్వరగా కలవరు. అది చూసి చాలామంది వారికి పొగరు అనుకుంటారు.. కానీ వాళ్లు ఎంతో మంచివారు. మహేశ్ చాలా కూల్. అవసరమైన సమయంలో అండగా నిలబడతాడు’ అని శిల్పా తెలిపింది.. ప్రజంట్ శిల్ప మాటలు వైరల్ అవుతున్నాయి.