Abhishek Nama: డెవిల్ సినిమా ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 29 అనగా రేపు రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలనే రేకెత్తించింది. అయితే.. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు.. ? అనేది హాట్ టాపిక్ గా మారింది. డెవిల్ ను మొదలుపెట్టినప్పుడు నవీన్ మేడారం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు అని చెప్పుకొచ్చారు. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించాడు. ఇక సినిమా మొత్తం పూర్తి అయ్యి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా నవీన్ పేరు పోస్టర్ పై ఉంది. ఆ తరువాత సడెన్ గా కొత్త పోస్టర్స్ లో డైరెక్టర్ పేరు మారిపోయింది. నవీన్ మేడారం ప్లేస్ లో నిర్మాత అభిషేక్ నామా వచ్చి చేరాడు. నిర్మాతకు, డైరెక్టర్ కు మధ్య విబేధాలు తలెత్తడంతో నిర్మాత నవీన్ ను సినిమా నుంచి తొలగించి తన పేరును వేసుకున్నట్లు చెప్పారు.
ఇక అలానే డైరెక్టర్, నిర్మాత స్థానంలో అభిషేక్ నామానే ప్రమోషన్స్ షురూ చేశాడు. అంతా బావున్న సమయంలో నవీన్ మేడారం.. ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేశాడు. డెవిల్ నా కష్టార్జితం. అది నా బిడ్డ. దాదాపు మూడేళ్లు నేను ఈ సినిమా కోసం కష్టపడ్డాను. దీనికోసం కళ్యాణ్ రామ్ ఎంతో శ్రమించాడు. నేను లేకపోయినా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ అభిషేక్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇంటర్వ్యూ ఏదైనా నవీన్ మేడారం గురించే ప్రస్తావన రావడంతో అభిషేక్ హర్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్నా ట్రోలింగ్ కారణం అభిషేక్ నామా మనస్తాపానికి గురయ్యినట్లు సమాచారం.
” నేను ఈ సినిమా కోసం 45 కోట్లు ఖర్చు చేసాను..నా జీవితం పణంగా పెట్టాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను.. అనవసరం నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తున్నారు” అని సన్నహితుల వద్ద బాధపడినట్లు తెలుస్తోంది. ఈ మనస్తాపం తోటే.. మిగిలిన ఇంటర్వ్యూలు కూడా క్యాన్సిల్ చేసినట్లు భోగట్టా. ఇక ఈ విషయమై నెటిజన్స్ తమదైనరీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ట్రోలింగ్ చేస్తే.. దైర్యంగా ఎదుర్కోవాలి.. సినిమా మీది అయ్యినప్పుడు నిలబడాలి అని కొందరు అంటుండగా.. ఇంకొందరు.. 4 ఇంటర్వ్యూలు హ్యాండిల్ చేయలేవు.. రూ. 45 కోట్లు సినిమా తీసావా.. ? అని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఇంతపెద్ద సినిమా మీరు తీశారంటే అస్సలు నమ్మబుద్ది కావడం లేదని అంటున్నారు. ఏదిఏమైనా డెవిల్ సినిమా రిలీజ్ అయ్యాకఈ ట్రోలింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమా రిజల్ట్ ఏంటి అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.