సమంత కోసం నిర్మాతగా స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంత కాలంగా సమంత బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. సామ్ తన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ సౌత్ తో పాటు నార్త్ లోనూ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. సామ్ అభినయానికి, ఆమె పోషించిన పాత్రకు అక్కడ మంచి ప్రజాదరణ దక్కింది. ప్రస్తుతం సామ్ హిందీ చలనచిత్ర పరిశ్రమలోకి పూర్తిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన మార్కెట్‌ను విస్తరించుకోవాలని భావిస్తోంది. అయితే బాలీవుడ్ లో సామ్ నటించబోయే చిత్రానికి మరో స్టార్ హీరోయిన్ నిర్మాతగా వ్యవహరిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది.
Read Also : 100 రోజులు పూర్తి చేసుకున్న “ఆదిపురుష్”
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
మిల్కీ బ్యూటీ తాప్సీ పన్ను నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాలో మెయిల్ రోల్ కోసం సామ్ ను సంప్రదించారట మేకర్స్. ఈ ఏడాది ప్రారంభంలో తాప్సీ తన ప్రొడక్షన్ హౌస్ అవుట్‌సైడర్ ఫిల్మ్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ బ్యానర్ నుంచి సమంతకు ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
తాప్సీ తొలి ప్రొడక్షన్ వెంచర్ “బ్లర్” షూటింగ్ ఇటీవలే పూర్తయింది.’సెక్షన్ 375′ ఫేమ్ అజయ్ బహల్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు సమంత తదుపరి తమిళ చిత్రం ‘కథు వాకులా రెండు కాదల్’లో కనిపించనుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సమంత డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో మరో ద్విభాషా ప్రాజెక్ట్‌కు సంతకం చేసింది. ఇది త్వరలో సెట్స్‌పైకి రానుంది. తెలుగులో ఆమె తాజా చిత్రం ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధం అవుతోంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!