సౌత్ స్టార్ తో క్లాష్… ‘లాల్ సింగ్ చద్దా’ వెనకడుగు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభమైన తర్వాత పెద్ద స్టార్స్ అందరూ తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. వారిలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఒకరు. ఆయన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ 2022 ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఈ చిత్రం విడుదల తేదీని వాయిదా వేశారు. కొన్ని కారణాల వల్ల అమీర్ ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో ఆయన పాత్ర బాల్యం నుండి వృద్ధాప్యం వరకు కథను వర్ణిస్తుంది. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ని భారీ స్థాయిలో ఉపయోగిస్తున్నారు. ఈ పనికి ఎంత సమయం పడుతుందని అనుకున్నారో దానికన్నా సమయం తీసుకుంటోంది వీఎఫ్‌ఎక్స్ వర్క్. అందుకే ‘లాల్ సింగ్ చద్దా’ను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయాలనీ భావిస్తున్నారట మేకర్స్. అప్పటికి ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తవుతాయి.
Read Also : హీరో సూర్యకు భద్రత… ఇంటి వద్ద హై సెక్యూరిటీ
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
కానీ ఈ అదే రోజు సినిమా విడుదలైతే సౌత్‌లోని బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటైన ‘కేజీఎఫ్ 2’ను అమీర్ ఢీ కొట్టడం ఖాయం. అందుకే ‘లాల్ సింగ్ చద్దా’ వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలు చాలా బిజీగా ఉండబోతున్నాయి ఏప్రిల్ లోనే సినిమాకు సరైన రిలీజ్ డేట్ వెతుక్కోవాలంటే కష్టమే. ఏప్రిల్ 14 కాకుండా ఈద్ సందర్భంగా సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అంటే ఏప్రిల్ 28న విడుదల కావొచ్చు. అయితే అదే సమయంలో సాజిద్ నడియావాలా ‘హీరోపంతి 2’, అజయ్ దేవగన్ ‘మే డే’ విడుదల కానున్నాయి. విడుదల తేదీని ఖరారు చేసే ముందు అమీర్ ఈ ఇద్దరు స్నేహితులతో మాట్లాడవచ్చు. ఇక సినిమా విడుదల తేదీ వాయిదా పడడం మాత్రం ఖాయం త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు.
అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి ఇది అధికారిక రీమేక్. ఈ చిత్రంలో కరీనా కపూర్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో దక్షిణాది నటుడి పేరు చైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!