ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆసియాన్ సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. కాగా జూన్ 20 న
వరల్డ్ వైడ్ గా కుబేర రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read : Tollywood : మరో స్టార్ ఫ్యామిలీ వారసుడి టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్
సోలో రిలీజ్ డేట్ దొరికడంతో కుబేరను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు మేకర్స్. కానీ ఇప్పుడు అనూహ్యంగా రేస్ లోకొచ్చాడు మిస్టర్ పర్ఫెక్ట్. 2007 లో అమిర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం తారే జమీన్ పర్ కు సీక్వెల్ గా సితారే జమీన్ పర్ ను తీసుకువస్తున్నాడు అమిర్ ఖాన్. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాను అమీర్ ఖాన్ నిర్మిస్తున్నాడు. కాగా ఇప్పుడు ఈ సినిమాను జూన్ 20న రిలీజ్ చేస్తునట్టు ప్రకటించాడు అమీర్ ఖాన్. తగ్స్ ఆఫ్ హిందూస్తాన్, లాల్ సింగ్ చద్దా వంటి భారీ డిజాస్టర్స్ తో లాంగ్ గ్యాప్ తీసుకున్న అమిర్ ఖాన్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని వస్తున్నాడు. సో ధనుష్ సినిమాకు బాలీవుడ్ లో అమీర్ సినిమాతో పోటీ తప్పదు. అలానే అమీర్ కు సౌత్ లో ధనుష్ సినిమాతో క్లాష్ తప్పదు. మరి ఈ రేస్ లో గెలుపెవరిదో చూద్దాం.