Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Aadi Saikumar Tees Maar Khan Teaser Review

Tees Maar Khan: రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించండి

Published Date :June 18, 2022 , 3:19 pm
By NTV WebDesk
Tees Maar Khan: రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘ప్రేమ కావాలి’ సినిమాతో గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన ఆది సాయికుమార్.. చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం పరి తపిస్తున్నాడు. ట్రెండ్‌కి తగ్గట్టు రకరకాల ప్రయోగాలు చేస్తోన్నా, ఏదీ కలిసి రావట్లేదు. అయినా పట్టు వదలకుండా వరుస సినిమాలు చేస్తోన్న ఆది.. ఇప్పుడు ‘తీస్ మాస్ ఖాన్’గా రాబోతున్నాడు. చకచకా పనులు ముగించుకుంటోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఒక నిమిషం 34 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌ని చూస్తుంటే, యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.

‘‘ఆఫీస్‌కు వెళ్లిన మా అన్న తిరిగి రాలేదు.. అసలేం జరుగుతోంది ఇక్కడ.. మనం ఆపాలనుకున్న పవర్ మన దగ్గరున్నా, మనం ఆపలేనంత పవర్ వాడిదగ్గరుంది సర్.. రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించండి’’ అంటూ సాగే డైలాగ్స్‌తో మొదలయ్యే ఈ టీజర్‌లో యాక్షన్‌తో పాటు హీరో-హీరోయిన్ల రొమాంటిక్ షాట్స్‌ని కూడా చూపించారు. పోలీసులకు చిక్కకుండా నేరాలకు పాల్పడే ఓ కరుడుగట్టిన విలన్, రౌడీ పోలీస్ గెటప్‌లో అల్లరి చేసే హీరో మధ్య సాగే పోరాటమే ఈ సినిమా నేపథ్యమని అర్థమవుతోంది. ఇందులో ఆది సాయికుమార్ కొంచెం డిఫరెంట్‌గా కనిపించడంతో పాటు ఆ క్యారెక్టర్‌లోనూ పూర్తిగా ఒదిగిపోయినట్టు కనిపిస్తున్నాడు.

ఇక మన పాయల్ రాజ్‌పుత్ ఎప్పట్లాగే ఇందులోనూ అందాల్ని బాగానే ఆరబోసింది. ముఖ్యంగా బీచ్ వద్ద పాయల్ కాస్త రెచ్చిపోయిందనే చెప్పుకోవాలి. హీరో-హీరోయిన్ల మధ్య ఘాటు రొమాన్స్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్‌గా చూసుకుంటే, టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గానే ఉంది. మరి, ఈ సినిమా అయితే ఆదిని గట్టెక్కిస్తుందా? లేదా? అనేది చూడాలి. ‘నాటకం’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించిన కళ్యాణ్ జీ గోగణ ఈ సినిమాకి దర్శకుడు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. సునీల్, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aadi Saikumar
  • Payal Rajpur
  • Poorna
  • tees maar khan
  • Tees Maar Khan Teaser

తాజావార్తలు

  • Putin praises Iran: ఉద్రిక్తతల మధ్య పుతిన్ ఇరాన్‌కు సాలిడ్ సపోర్ట్.. రష్యా నమ్మకమైన స్నేహితుడు అంటూ సందేశం

  • CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!

  • MS Dhoni IPL Retirement: ఇదే చివరి సీజనా..? ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్..

  • DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్

  • MS Dhoni Missed Stumping: చెపాక్‌లో సందడి చేసిన CSK లెజెండ్స్.. స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ.. వీడియో వైరల్.!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions